25-09-2025 / గురువారం / రాశి ఫలితాలు

మేషం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
వృషభం
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
మిధునం
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు తప్పవు. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కర్కాటకం
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహంలో సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
సింహం
నూతన వాహన యోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కన్య
పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు.
తుల
ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటి బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం
ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.
ధనస్సు
నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకరం
ఇంటి బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహంలో శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి.
కుంభం
మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం
ఇతరులకు మాటిచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.
శుభం భూయాత్
