రాశి ఫలితాలు

30-08-2025 శనివారం రాశి ఫలితాలు 🌟

blank

♈ మేషం

ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు.
వృత్తి, వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు.
నూతన ఉద్యోగ యోగం ఉన్నది.


♉ వృషభం

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి.
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వృత్తి ఉద్యోగ సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు.


♊ మిధునం

ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు.
కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
బంధుమిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.
గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.


♋ కర్కాటకం

మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.
స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు.
ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేయకపోవడం మంచిది.
కుటుంబంతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.


♌ సింహం

బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
నిరుద్యోగులకు ఎంతోకాలంగా ఎదురుచూసిన అవకాశాలు లభిస్తాయి.
భూసంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుస్తారు.
కొన్ని వ్యవహారాలలో సోదరుల సహాయం పొందుతారు.
ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది.


♍ కన్య

సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది.
చేపట్టిన పనులలో జాప్యం ఉన్నా చివరికి పూర్తి చేస్తారు.
వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి.
ఉద్యోగంలో సమయోచిత నిర్ణయాలతో లాభాలు పొందుతారు.


♎ తుల

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.
కుటుంబ సభ్యుల నుండి ధనసహాయం లభిస్తుంది.
దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారులు ప్రశంసలు అందిస్తారు.
పనులు సకాలంలో పూర్తవుతాయి.


♏ వృశ్చికం

నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.
ఆర్థిక పరిస్థితి ఉత్సాహంగా సాగుతుంది.
చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి.
సోదరులతో పాత విషయాలపై చర్చలు జరుగుతాయి.
వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.
ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.


♐ ధనస్సు

మిత్రులతో వ్యాపార చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యుల సహాయంతో ఆర్థిక సమస్యలు సద్దుమణుగుతాయి.
దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు వస్తాయి.
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
అధికారుల అనుగ్రహంతో పనులు విజయవంతమవుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది.


♑ మకరం

వివాదాలు మిత్రుల సహాయంతో రాజీ అవుతాయి.
దైవ సేవా కార్యక్రమాలకు హాజరవుతారు.
వ్యాపార పరంగా నూతన అవకాశాలు కోల్పోకుండా చూడాలి.
నూతన వస్తు, వాహన లాభాలు పొందుతారు.
ఉద్యోగంలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.


♒ కుంభం

వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహం లభిస్తుంది.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.
శుభకార్యాలకు కుటుంబంతో హాజరవుతారు.
గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.
వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు.
పనులలో శారీరక శ్రమ తప్పదు.


♓ మీనం

సన్నిహితుల నుండి వివాదాలపై కీలక సమాచారం పొందుతారు.
ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు వస్తాయి.
క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది.
దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.


blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు