2025 జూలై 9 రాశిఫలాలు

ఆధారంగా: జ్యోతిష శాస్త్రం & పంచాంగ గణన
🐏 మేషం
చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి జీవితంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
🐂 వృషభం
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తొందరపడకండి. స్వల్ప అనారోగ్యం కలగవచ్చు. వ్యాపారాలు నిదానంగా సాగతాయి. సహోద్యోగులతో మాటపట్టింపులు సంభవిస్తాయి.
👥 మిథునం
పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట శ్రమ అధికమవుతుంది. ఆధ్యాత్మికతపై దృష్టి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. నిరుద్యోగులకు సమర్థ ప్రయత్నాలైనా ఫలితం తక్కువ. వ్యాపారాలు మందగిస్తాయి.
🦀 కర్కాటకం
ప్రధాన విషయాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబంతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
🦁 సింహం
సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా కష్టాలున్నా, నూతన ఋణ ప్రయత్నాలు అవసరమవుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కావచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతికి కొదువ.
👧 కన్య
భూ వ్యవహారాలలో లాభం. కుటుంబ సభ్యుల నుంచి అకస్మాత్తుగా ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
⚖ తుల
ఋణ భారం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు. వ్యాపార నిర్ణయాల్లో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యకరం. వృత్తిలో సాధారణ ఫలితాలు మాత్రమే.
🦂 వృశ్చికం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు. వృత్తిలో కీలక సమాచారం సేకరణ. చిన్ననాటి మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తిలో మంచి పరిస్థితులు. నూతన వాహన కొనుగోలు విజయవంతం.
🏹 ధనస్సు
పనుల్లో విజయాలు. నిరుద్యోగ యత్నాల వేగం పెరుగుతుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు. ఉద్యోగంలో బాధ్యతల నుంచి ఉపశమనం.
🐊 మకరం
వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం. వృత్తిలో ఊహించని సమస్యలు. నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు.
🌊 కుంభం
పనులు మందగమనం కలిగి ఉంటాయి. వ్యాపార నిర్ణయాల్లో మార్పులు చేయవలసివస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. బంధువులతో చిన్న విభేదాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు అధిక శ్రమ అవసరం.
🐟 మీనం
వ్యాపారాలు లాభదాయకంగా సాగతాయి. ఉద్యోగంలో పదోన్నతుల అవకాశాలు. సన్నిహితులతో సఖ్యతగా మెలుగుతారు. సోదరుల నుంచి ప్రత్యేక ఆహ్వానాలు. వృత్తిలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు. విలువైన వస్తువుల లాభం.
శ్రీ గురుభ్యోనమః🙏☘️
ముక్తినూతలపాటి వాసు
