27/09/2025 – శనివారం- శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారం
ఆశ్వయుజ శుద్ధ పంచమి చీర రంగు: బంగారు 🌺 అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు,శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తారు. తనను ప్రార్థించే భక్తులకు అనుగ్రహములు ప్రసాదిస్తారు.అమ్మవారి ఇరువైపులా శ్రీ లక్ష్మీదేవి మరియు శ్రీ సరస్వతీదేవి వింజామరలతో సేవచేస్తూ ఉంటారు.చిరునవ్వుతో వాత్సల్యమూర్తిగా శివుని వక్షస్థలంపై కూర్చొని దర్శనమిచ్చే అమ్మవారిని,పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపురసుందరీ దేవిగా భక్తులు ఆరాధిస్తారు. 📜 లలితా సప్తనామావళి కాంచీ కామకోటి పీఠాధిపతిశ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామిఅత్యంత ముఖ్యమైన ఏడు నామాలను ప్రతిరోజూ […]

