🕉️ ఓం నమః శివాయ ⚛️
శివలింగము మరియు దాని అయిదు ముఖాల వివరణ శివలింగంలో తూర్పు దిశకు చూసే ముఖాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్టానంగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది. దక్షిణ దిశకు చూస్తున్న ముఖాన్ని అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాసిస్తుంది, లయాన్ని కలుగజేస్తుంది. అజ్ఞానాన్ని దహించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పశ్చిమం దిశను చూస్తున్న ముఖాన్ని సద్యోజాత ముఖము అంటారు. దీని ద్వారా పాలు, నీళ్లు, విభూతి, పళ్ళరసములు కారిపోతూ ఉంటాయి. శివలింగం […]