భీష్మ ఏకాదశి సందర్భంగా
శ్రీ మన్మహా భారతాన్ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ, వినాలని అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక ధర్మ, జ్ఞాన భాండాగారం. భారతం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మపితామహుడు మరియు విష్ణు సహస్రనామాలు. భీష్ముడు కురువంశ పితామహుడు (తాతగారు). హస్తినాపురం కురువంశ జన్మభూమి. దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరత భూమి. భరతుని కొడుకు సహోత్రుడు, అతని కొడుకు హస్తి. ఆ హస్తి చేత నిర్మితమైనదే హస్తినాపురం. […]