03-09-2025 / బుధవారం / రాశి ఫలితాలు 🌸

♈ మేషం దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.
♈ మేషం
దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
♉ వృషభం
ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది.
♊ మిధునం
శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
♋ కర్కాటకం
నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
♌ సింహం
ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. దైవచింతన కలుగుతుంది.
♍ కన్య
ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటా బయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
♎ తుల
కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.
♏ వృశ్చికం
ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
♐ ధనస్సు
చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
♑ మకరం
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.
♒ కుంభం
అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు కలిగిస్తుంది.
♓ మీనం
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
🍀 శుభం భూయాత్ 🍀
తరచుగా అడిగే ప్రశ్నలు
03-09-2025 బుధవారం మేష రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి?
మేష రాశి వారికి దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుందని, ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుందని సూచించారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయని పేర్కొన్నారు.
03-09-2025న ఆర్థికంగా ఏ రాశుల వారికి అనుకూల సూచనలు ఉన్నాయి?
కన్య రాశి వారికి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుందని, వృశ్చిక రాశి వారికి ధనాదాయ మార్గాలు పెరిగి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారని సూచించారు. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు.
03-09-2025 బుధవారం ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
మిధున రాశి వారికి అనారోగ్య సమస్యలు, ఋణదాతల ఒత్తిడి; సింహ రాశి వారికి ధనపరంగా ఇబ్బందులు సూచించబడ్డాయి. తుల రాశి వారికి అనుకోని ఖర్చులు, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు; కుంభ రాశి వారు ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదని పేర్కొన్నారు.
03-09-2025న వాహనం, వస్త్రాభరణాల కొనుగోలు ఏ రాశులకు సూచించబడింది?
మీన రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారని, కర్కాటక రాశి వారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారని సూచించారు. మకర రాశి వారు గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారని చెప్పారు.
03-09-2025 బుధవారం ఉద్యోగస్తులకు ఏ రాశుల ఫలితాలు బాగున్నాయి?
ధనస్సు రాశి ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారని, వృశ్చిక రాశి వారికి అధికారుల అనుగ్రహం కలుగుతుందని సూచించారు. వృషభ రాశి వారికి మాత్రం పని ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 9 నవంబర్ 2026 సోమవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- కార్తీక మాసం 2026 రాశి ఫలాలు – 12 సూర్య రాశులకు: మేషం నుండి మీనం వరకు ఉద్యోగం, ఆర్థికం, ప్రేమ, వివాహం మరియు ఆధ్యాత్మిక పరిహారాలు
- 8 నవంబర్ 2026 ఆదివారం రాశి ఫలాలు — 12 రాశులకు నేటి దిన ఫలాలు
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు




