రాశి ఫలితాలు – 06 సెప్టెంబర్ 2025 (శనివారం)

♈ మేషం ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన లాభాలు పొందుతారు.
♈ మేషం
ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన లాభాలు పొందుతారు.
ఉద్యోగ విషయంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.
నిరుద్యోగులకు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి.
♉ వృషభం
వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది.
చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.
ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువవుతాయి.
ఉద్యోగంలో ఇతరులతో వాగ్వాదం తప్పదు.
నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
♊ మిధునం
దూరప్రాంత బంధువులతో శుభకార్యాలకు హాజరవుతారు.
విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు పొందుతారు.
విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
ఉద్యోగస్తులకు పదవీ ప్రమోషన్లు కలుగుతాయి.
ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.
♋ కర్కాటకం
కీలక వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగాలి.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు.
బంధు మిత్రులతో ఏర్పడిన విభేదాల పరిష్కారం ఆలస్యమవుతుంది.
ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.
వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.
♌ సింహం
సమాజ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి.
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది.
♍ కన్యా
ఉద్యోగంలో అధికారుల అనుకూలత పెరుగుతుంది.
రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.
గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు.
వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ పూర్తి చేస్తారు.
ఆర్థిక పరిస్థితి సగటుగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం లభిస్తుంది.
♎ తుల
ఆర్థిక వృద్ధి కలుగుతుంది.
కీలక పనులలో జీవిత భాగస్వామి సలహా ఉపయుక్తం అవుతుంది.
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు ఉంటాయి.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి.
♏ వృశ్చికం
కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.
ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా ఉండదు.
ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి.
దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
నిరుద్యోగుల కృషి వృధాగా మారుతుంది.
కొత్త రుణాలు చేయకపోవడం మంచిది.
♐ ధనుస్సు
చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.
సోదరులతో భూమి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి.
ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
♑ మకరం
కీలక పనులలో విజయాన్ని సాధిస్తారు.
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు ఉంటాయి.
కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.
♒ కుంభం
చేపట్టిన పనులు ఆలస్యంగా సాగుతాయి.
సంతాన ఆరోగ్యంపై వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.
అవసరం లేని ఖర్చులను తగ్గించాలి.
వృత్తి వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండండి.
ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
సంతాన విద్యాపై దృష్టి పెట్టాలి.
♓ మీనం
ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
సన్నిహితుల శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి.
చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి.
వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.
🍁 శుభం భూయాత్ 🍀




