04-09-2025 గురువారం రాశి ఫలితాలు

మేషం విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మేషం
- విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
- ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
- వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
- చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.
- నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు.
- అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
వృషభం
- వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
- వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
- కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి.
- సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
- నూతన ఋణ యత్నాలు కలసిరావు.
మిధునం
- శ్రమాదిక్యాతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు.
- ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు.
- ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.
- వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
- వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
- దైవ చింతన పెరుగుతుంది.
- నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.
కర్కాటకం
- చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి.
- కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడగలరు.
- విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
- ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
- వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
- వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
సింహం
- దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
- కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది.
- బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి.
- వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
- క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య
- కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి.
- స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
- భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
- చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి.
- నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.
తుల
- జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.
- ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.
- నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు.
- దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి.
- వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
వృశ్చికం
- సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.
- అన్నిరంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.
- వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
- బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
- ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.
ధనస్సు
- మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
- ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
- చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని మీ మాటకు తీసుకొస్తారు.
- మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు.
- వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
మకరం
- మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు.
- కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
- సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి.
- వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు.
- ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.
- దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం
- గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- మిత్రులకు ధన సహాయం అందిస్తారు.
- విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
- శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
- వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు.
మీనం
- అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.
- విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి.
- విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు.
- క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.
- వృత్తి వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.
- ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు
04-09-2025 గురువారం మేష రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి?
మేష రాశి వారికి విలువైన వస్త్ర ఆభరణాల కొనుగోలు, ఆదాయ మార్గాలు పెరగడం సూచించబడింది. నూతన వ్యాపారాలలో ఆశించిన లాభాలు, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా సూచనలుగా ఉన్నాయి.
04-09-2025 న ఏ రాశుల వారికి ఆకస్మిక ధనప్రాప్తి, ఆర్థిక పురోగతి సూచించబడింది?
ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి సూచించబడింది. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారని, సింహ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుందని ఫలితాలు చెబుతున్నాయి.
04-09-2025 గురువారం ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
తుల రాశి వారు ప్రయాణాలలో వాహన విషయంలో, జీవిత భాగస్వామి ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి. మిధున రాశి వారు నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది, కన్య రాశి వారు భాగస్వామి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
04-09-2025 న విద్యార్థులకు ఏ రాశుల్లో అనుకూలత ఉంది?
కుంభ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారని సూచించబడింది. వృశ్చిక రాశి వారికి సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయని, కర్కాటక రాశి వారికి విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయని ఫలితాలు చెబుతున్నాయి.
04-09-2025 గురువారం మకర రాశి వారికి ఫలితాలు ఏమిటి?
మకర రాశి వారు మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు, కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని సూచించబడింది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి, అయితే ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 9 నవంబర్ 2026 సోమవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- కార్తీక మాసం 2026 రాశి ఫలాలు – 12 సూర్య రాశులకు: మేషం నుండి మీనం వరకు ఉద్యోగం, ఆర్థికం, ప్రేమ, వివాహం మరియు ఆధ్యాత్మిక పరిహారాలు
- 8 నవంబర్ 2026 ఆదివారం రాశి ఫలాలు — 12 రాశులకు నేటి దిన ఫలాలు
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు




