కార్తీక అమావాస్య – మహా లక్ష్మీ జయంతి

(కమలా జయంతి – లక్ష్మీదేవి భూలోకాగమన దినం) ప్రాముఖ్యత బ్రహ్మ పురాణం ప్రకారం కార్తీక అమావాస్య నాడు శ్రీ మహాలక్ష్మి స్వయంగా భూమిపైకి వస్తుంది. ఈ రోజు ఆచరించే ఒక్క ఉపవాసం కార్తీక మాసమంతా ఉపవాసం చేసిన ఫలితాన్ని ఇస్తుంది.
(కమలా జయంతి – లక్ష్మీదేవి భూలోకాగమన దినం)
ప్రాముఖ్యత
బ్రహ్మ పురాణం ప్రకారం కార్తీక అమావాస్య నాడు శ్రీ మహాలక్ష్మి స్వయంగా భూమిపైకి వస్తుంది. ఈ రోజు ఆచరించే ఒక్క ఉపవాసం కార్తీక మాసమంతా ఉపవాసం చేసిన ఫలితాన్ని ఇస్తుంది.
ఈ రోజు చేయవలసిన కార్యక్రమాలు
తెల్లవారుజామున
- కార్తీక స్నానం (పవిత్ర నది లేదా ఇంట్లోనే)
- పంచ పల్లవాలతో అభ్యంగ స్నానం (రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి)
- తులసికోట వద్ద నేతి దీపం వెలిగించాలి
ఆలయ దర్శనం
- శివాలయం లేదా విష్ణాలయంలో ఆవునేతితో రెండు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకోవాలి
సాయంత్రం – ప్రదోష కాలం
- ఇంట్లో, ఆలయంలో, తులసికోట వద్ద, కూడల్లో ఆవునేతి దీపాలు వెలిగించాలి
- మహాలక్ష్మీ స్తోత్రం, అష్టలక్ష్మీ స్తోత్రం పఠించి హారతి ఇవ్వాలి
- ఇంటిని ముగ్గులు, తోరణాలు, దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి
పితృ కార్యాలు
- కార్తీక అమావాస్య నాడు తర్పణం, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది వంశాభివృద్ధి ప్రసాదిస్తారు
పుష్కర స్నాన ఫలితం అమా సోమే తథా భౌమే గురువారే యదా భవేత్। తత్తీర్థం పుష్కరం నామ సూర్యపర్వ శతాధికం॥ సోమ, మంగళ, గురువారాల్లో వచ్చే అమావాస్య స్నానం సామాన్య సూర్యపర్వం కంటే నూరు రెట్లు శ్రేష్ఠం.
స్వాతి నక్షత్రం కలిస్తే మరింత విశేషం స్వాతిస్థితే రవౌ విందు యది స్వాతి గతో భవేత్ పంచత్వగుదకస్నాయీ కృతాభ్యంగ విధిర్నరైః నీరాజితో మహాలక్ష్మీమ్ అర్చయన్ శ్రియమశ్నుతే పంచపత్ర స్నానం చేసి లక్ష్మీనారాయణులకు నీరాజనం ఇస్తే అపార సంపదలు కలుగుతాయి.
రాత్రి జాగరణ – ముఖ్యం
- ఆశ్వయుజ, కార్తీక అమావాస్యల్లో రాత్రి నిద్రించరాదు
- లక్ష్మీదేవి అర్ధరాత్రి వీధుల్లో సంచరిస్తూ దీపాలు వెలిగిన ఇంట్లో ప్రవేశిస్తుంది
- దీపాలు ఆరిపోయిన ఇంటికి ఆమె రాదు (పురాణ వచనం)
బ్రాహ్మీ ముహూర్తంలో డప్పు, శంఖ, ఘంటికలతో అలక్ష్మి (దారిద్ర్యం) ని తరిమికొట్టాలి.
ఈ కార్తీక అమావాస్య (20 నవంబర్ 2025) నాడు లక్ష్మీ కటాక్షం, పితృదేవతల అనుగ్రహం, అష్టైశ్వర్యాలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.
లక్ష్మీ సమేత సదాశివుడు మీ అందరికీ సర్వాభీష్టాలు తీర్చాలని ప్రార్థన.
తరచుగా అడిగే ప్రశ్నలు
కార్తీక అమావాస్యను లక్ష్మీ జయంతి అని ఎందుకు అంటారు?
బ్రహ్మ పురాణం ప్రకారం కార్తీక అమావాస్య నాడు శ్రీ మహాలక్ష్మి స్వయంగా భూమిపైకి వస్తుంది. అందుకే దీనిని కమలా జయంతి, లక్ష్మీదేవి భూలోకాగమన దినం అని కూడా అంటారు.
కార్తీక అమావాస్య ఉపవాసం ఫలితం ఏమిటి?
ప్రచారంలో ఉన్నట్లుగా, ఈ రోజు ఆచరించే ఒక్క ఉపవాసం కార్తీక మాసమంతా ఉపవాసం చేసిన ఫలితాన్ని ఇస్తుంది.
కార్తీక అమావాస్య ఉదయం ఏమి చేయాలి?
తెల్లవారుజామున కార్తీక స్నానం చేసి, రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి అనే పంచ పల్లవాలతో అభ్యంగ స్నానం చేయాలి. తులసికోట వద్ద నేతి దీపం వెలిగించి, శివాలయం లేదా విష్ణాలయంలో ఆవునేతితో రెండు దీపాలు వెలిగించాలి.
కార్తీక అమావాస్య సాయంత్రం లక్ష్మీ పూజ ఎలా చేయాలి?
ప్రదోష కాలంలో ఇంట్లో, ఆలయంలో, తులసికోట వద్ద, కూడళ్లలో ఆవునేతి దీపాలు వెలిగించాలి. మహాలక్ష్మీ స్తోత్రం, అష్టలక్ష్మీ స్తోత్రం పఠించి హారతి ఇచ్చి, ఇంటిని ముగ్గులు, తోరణాలతో అలంకరించాలి.
కార్తీక అమావాస్య రాత్రి ఎందుకు జాగరణ చేయాలి?
పురాణ వచనం ప్రకారం లక్ష్మీదేవి అర్ధరాత్రి వీధుల్లో సంచరిస్తూ దీపాలు వెలిగిన ఇంట్లో ప్రవేశిస్తుంది, దీపాలు ఆరిపోయిన ఇంటికి రాదు. అందుకే ఆ రాత్రి నిద్రించరాదు.
కార్తీక అమావాస్య నాడు పితృ కార్యాలు చేయవచ్చా?
అవును, ఈ రోజు తర్పణం, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది వంశాభివృద్ధి ప్రసాదిస్తారని నమ్మకం.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
హిందూ దేవుళ్ళు నుంచి మరిన్ని
- శనివారం హనుమంతుణ్ణి ఎందుకు పూజిస్తారు? భక్తుల కోసం సమగ్ర మార్గదర్శి
- కార్తికేయుడు: యుద్ధ దేవుడు – చరిత్ర, ప్రాముఖ్యత మరియు పూజా విధానాలు
- తొమ్మిది రాత్రులు, తొమ్మిది రూపాలు: ప్రవాస భారతీయుల అత్యంత స్థిరమైన పండుగ నవరాత్రి
- జ్యేష్ఠ శుక్ల దశమి – దశపాపహర దశమి: పవిత్ర గంగావతరణం
- మీ నవరాత్రి శిశువు కోసం దుర్గా దేవి స్ఫూర్తితో 99 పేర్లు




