మన తలరాత మార్చే గీత | భగవద్గీత చూపించే ఆధ్యాత్మిక మార్గం
🌺 మన తలరాత మార్చే గీత 🌺 🙏 శ్రీకృష్ణార్పణమస్తు 🙏 ━━━━━━━━━━━━━━━━━━━━━━ 🌿 మన లోపల ఉన్న అసలైన వాడు మన లోపల ఒకడు ఉన్నాడు.
🌺 మన తలరాత మార్చే గీత 🌺
🙏 శ్రీకృష్ణార్పణమస్తు 🙏
━━━━━━━━━━━━━━━━━━━━━━
🌿 మన లోపల ఉన్న అసలైన వాడు
మన లోపల ఒకడు ఉన్నాడు... అసలైన వాడు..
కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు...
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు..!
ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం...
ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు.
వాళ్ళే కామం, క్రోధం...
ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో...
📖
" కామ ఏష క్రోధ ఏష రజో
గుణ సముద్భవహ "
📖
ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు...
కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు.
ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు...
━━━━━━━━━━━━━━━━━━━━━━
🌿 గుణాల భవనం
అయితే ఈ రజో గుణం అనేది First Floor...
ఇంకా మనం First Floor కు రాలేదు...
మనం Ground Floor లో ఉన్నాం.
మనలో ఉండే తమో గుణమే ఆ Ground Floor.
అంటే మనం తమో గుణంలో ఉన్నాం.
బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం...
ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం...
ఇంకా Ground Floor లోనే ఉన్నాం.
ఈ Ground Floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం.
అలాటి ఈ Ground Floor నుండి పైకి వచ్చి, First Floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second Floor వస్తుంది.
ఆ Floor పేరు...
✨ సత్వ గుణం ✨
ఈ Floor చాలా పెద్దగా ఉంటుంది...
హాయిగా ఉంటుంది...
ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది...
━━━━━━━━━━━━━━━━━━━━━━
🌿 మంచి దొంగ
అయితే చిన్న సమస్య...
ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు.
భయపడకండి...
వాడు...
మంచి దొంగ...
వాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు.
మీకు Third Floor కు దారి చూపిస్తాడు.
ఆ Floor పేరు...
✨ శుద్ధ సాత్వికం ✨
ఇదే చివరిది...
ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది...
ఆ అఖండమైన వెలుగే పరమాత్మ...
అది వెలుగులకు వెలుగు...
మహావెలుగు.
━━━━━━━━━━━━━━━━━━━━━━
🚀 గీత అనే లిఫ్ట్
చివరిగా ఒక Good News ఏమిటంటే...
మనం Ground Floor నుండి Third Floor వరకు వెళ్ళడానికి ఒక లిఫ్ట్ ఉంది.
అదే...
📖 భగవద్గీత 📖
గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.
పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు...
━━━━━━━━━━━━━━━━━━━━━━
🌺 శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️ 🌺




