బ్రాహ్మణ కులాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించే ధోరణితో…
అంగీ (చొక్కా) తొడగవు ఎందుకయ్యా… జంధ్యం తీయవు ఎందుకయ్యా…” అంటూ
జీడి సారయ్య పాడిన ద్వేషపూరిత గీతాన్ని వ్యతిరేకిస్తూ TBSSS చేపట్టిన నిరసన ఉద్యమం ఘన విజయాన్ని సాధించింది.

TBSSS సభ్యుల ఐక్యత, పట్టుదల ముందు
జీడి సారయ్య వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
తన యూట్యూబ్ అకౌంట్ నుంచే ఆ వీడియోను స్వయంగా తొలగించడం,
TBSSS శక్తి ఎంత ప్రామాణికమో మరోసారి రుజువు చేసింది.

Advertisement

వివిధ జిల్లాల నుంచీ క్షణాల్లో వెల్లువెత్తిన ఫిర్యాదులు,
సభ్యుల సమైక్య స్పందన, సంస్థ పట్ల చూపిన ప్రేమ —
ఇవన్నీ కలిసి ఈ విజయాన్ని సాధ్యంచేశాయి.

TBSSS చేపట్టే ప్రతి కార్యానికి
సభ్యులు ఇలాగే హృదయపూర్వకంగా స్పందిస్తారన్నది
ఈ విజయం మళ్లీ చాటిచెప్పింది.

Advertisement

TBSSS లోని అన్ని విభాగాలు, జిల్లా బాధ్యులు, నాయకులు, సభ్యులందరికీ
హృదయపూర్వక ధన్యవాదాలు.