22-09-2025 సోమవారం నుండి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా,
అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కారాలు అర్పిద్దాం.

శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు

మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి,
విజయవాడ కనకదుర్గాదేవి, కాంచీ కామాక్షి, మధురమీనాక్షి, కాశీ విశాలాక్షి, శారదామాత,
తెలంగాణ బతుకమ్మ, గ్రామదేవత పోలేరమ్మ,
అమ్మలుగన్న అమ్మ మూలపుటమ్మ మహిషాసుర మర్దిని –
ఈ దివ్యరూపిణి తల్లిని స్మరించుకుందాం.


శ్లోకము

శ్రీవిద్యాం శరదిందుపూర్ణవదనాం హ్రీంకారబీజాక్షరీం
మాణిక్యాదిమనోజ్ఞరత్నవిభవాం చిద్రూపిణీం శారదాం
త్రైలోక్యైకవిరాజమానరుచిరా మింద్రాదిసంపూజితాం
ధ్యాయేత్పావనమాతరం భగవతీం కారుణ్యవారాంబుధిమ్


శరన్నవరాత్రి ఆరాధన

దసరా శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు.

ఈ శరన్నవరాత్రులలో భక్తులు శక్తి కొలది ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా అమ్మవారిని ఆరాధించి, దినదినం ఆయురారోగ్య, వ్యాపార, ఉద్యోగ వృద్ధితో పాటు ధన, కనక, వస్తు, వాహనాదుల ఐశ్వర్యాలను పొందాలని ప్రార్థించాలి.

భక్తులు యథాశక్తిగా గణపతి పూజతో ఆరంభించి, ఏరోజు ఏ అవతారమో ఆ రోజు ఆ అమ్మవారి అష్టోత్తర శతనామాలను చదివి పూజించడం ఉత్తమం.


నవరాత్రి రోజువారీ దేవి అలంకారములు

22-09-2025 సోమవారం – ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారం
చీర రంగు: లేత గులాబీ
నైవేద్యం: బెల్లం పొంగలి

23-09-2025 మంగళవారం – ఆశ్వయుజ శుద్ధ విదియ
శ్రీ గాయత్రీ దేవి అలంకారం
చీర రంగు: నారింజ
నైవేద్యం: నిమ్మకాయ పులిహోర

24-09-2025 బుధవారం – ఆశ్వయుజ శుద్ధ తదియ
శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
చీర రంగు: గంధం
నైవేద్యం: దధ్యోజనం / కట్టె పొంగలి

Advertisement

25-09-2025 గురువారం – ఆశ్వయుజ శుద్ధ చవితి
శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం
చీర రంగు: కనకాంబరం
నైవేద్యం: పాలాన్నం

26-09-2025 శుక్రవారం – ఆశ్వయుజ శుద్ధ పంచమి
శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
చీర రంగు: పింక్
నైవేద్యం: రవ్వకేసరి

27-09-2025 శనివారం – ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారం
చీర రంగు: బంగారు
నైవేద్యం: పరమాన్నం / అల్లం గారెలు

28-09-2025 ఆదివారం – ఆశ్వయుజ శుద్ధ సప్తమి
శ్రీ మహాచండీ దేవి అలంకారం
చీర రంగు: ఎరుపు
నైవేద్యం: చక్కెర పొంగలి

29-09-2025 సోమవారం – ఆశ్వయుజ శుద్ధ అష్టమి
శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూల నక్షత్రం)
చీర రంగు: తెలుపు
నైవేద్యం: కొబ్బరి అన్నం / అటుకులు / బెల్లం

30-09-2025 మంగళవారం – ఆశ్వయుజ శుద్ధ నవమి (మహానవమి)
శ్రీ దుర్గాదేవి అలంకారం
చీర రంగు: ముదురు నీలం
నైవేద్యం: కదంబం

01-10-2025 బుధవారం – ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)
శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం
చీర రంగు: మెరూన్
నైవేద్యం: పొంగలి / గారెలు / వడపప్పు / పానకం

02-10-2025 గురువారం – ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం
చీర రంగు: ఆకుపచ్చ
నైవేద్యం: పులిహోర


ముగింపు

ఈ ఆశ్వయుజ నవరాత్రులలో అమ్మవారిని యథాశక్తిగా ఆరాధించినవారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

శ్రీ మాత్రే నమః – శ్రీ మహాలక్ష్మ్యై నమః – శ్రీ సరస్వత్యై నమః
వాసు ముక్తినూతలపాటి

Advertisement


తరచుగా అడిగే ప్రశ్నలు

ఆశ్వయుజ శరన్నవరాత్రి 2025 ఎప్పుడు ప్రారంభమైంది?

ఆశ్వయుజ మాస శరన్నవరాత్రులు 22-09-2025 సోమవారం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంతో ప్రారంభమయ్యాయి.

శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి?

భక్తులు శక్తి కొలది ఉదయం, సాయంత్రం రెండు పూటలా అమ్మవారిని ఆరాధించాలి. గణపతి పూజతో ఆరంభించి, ఏరోజు ఏ అవతారమో ఆ అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదివి పూజించడం ఉత్తమం.

శరన్నవరాత్రి 2025 మూల నక్షత్రం రోజు ఏ అలంకారం?

29-09-2025 సోమవారం, ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు మూల నక్షత్రంతో శ్రీ సరస్వతీ దేవి అలంకారం. చీర రంగు తెలుపు, నైవేద్యం కొబ్బరి అన్నం / అటుకులు / బెల్లం.

మహానవమి, విజయదశమి 2025 రోజుల్లో అమ్మవారి అలంకారాలు ఏవి?

30-09-2025 మహానవమి నాడు శ్రీ దుర్గాదేవి అలంకారం (ముదురు నీలం చీర, కదంబం నైవేద్యం). 01-10-2025 విజయదశమి నాడు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం (మెరూన్ చీర).

అన్నపూర్ణా దేవి, మహాలక్ష్మి అలంకారాలకు నైవేద్యం ఏమిటి?

24-09-2025 అన్నపూర్ణా దేవికి గంధం రంగు చీర, దధ్యోజనం / కట్టె పొంగలి నైవేద్యం. 26-09-2025 మహాలక్ష్మి దేవికి పింక్ చీర, రవ్వకేసరి నైవేద్యం.

శరన్నవరాత్రుల చివరి రోజు ఏ అలంకారం?

02-10-2025 గురువారం, ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. చీర రంగు ఆకుపచ్చ, నైవేద్యం పులిహోర.