ఆధ్యాత్మికత
గణపతి తత్త్వం – గణపతి అంటే ఎవరు?

శాస్త్రాలు చెప్పిన గణపతి తత్వం లోతైనది, గంభీరమైనది.
శాస్త్రాలు చెప్పిన గణపతి తత్వం లోతైనది, గంభీరమైనది.
మన దేహ నిర్మాణానికి ఎనిమిది ముఖ్యమైన అంగాలు ఆధారం. వాటిని పుర్యష్టకం అని అంటారు.
1. పంచ జ్ఞానేంద్రియాలు
Advertisement
- కళ్ళు
- చెవులు
- ముక్కు
- నాలుక
- చర్మము
2. పంచ కర్మేంద్రియాలు
- కాళ్లు
- చేతులు
- నోరు
- పాయువు (మలద్వారము)
- పిపస్థ (మూత్రద్వారము)
3. పంచభూతములు
- ఆకాశం
- వాయువు
- అగ్ని
- జలం
- భూమి (పృధ్వి)
Advertisement
4. పంచప్రాణములు
- ప్రాణ
- అపాన
- వ్యాన
- ఉదాన
- సమాన
5 నుండి 8 వరకు
- కామము (కోరిక)
- కర్మ
- అవిద్య
- మనస్సు
పుర్యష్టకమే గణం
ఈ ఎనిమిది అంగాల సమాహారమే మన శరీరం. శాస్త్రంలో దానిని "పురము" అంటారు.
అందువల్ల ఈ ఎనిమిది అంగాల సమూహం పుర్యష్టకం అని ప్రసిద్ధి చెందింది.
ఈ పుర్యష్టకం (మన దేహమే) గణం.
దీనికి అధిపతి, నియంత్రకుడు, ఆధారభూతుడు గణపతి.
గణపతి తత్వ సారం
సర్వజీవులలో అంతర్లీనంగా ఉండి, జీవశక్తిని ప్రసాదిస్తూ, మనస్సు–ఇంద్రియాలను నడిపించే పరమశక్తే గణపతి.
ఆయన లేక జీవితం లేదు, చలనం లేదు, జ్ఞానం లేదు.
ఓం గం గణపతయే నమః




