కర్మ – దైవం – విధి: కర్మఫలం సత్యం & ఓం ధ్యానం మహిమ

కర్మ – దైవం – నువ్వు చేసే “మంచి”ని నువ్వు మరిచిపోయినా – దైవం మరిచిపోదు. నువ్వు చేసే “చెడు”ని దైవం క్షమించినా – కర్మ మరిచిపోదు.
కర్మ – దైవం –
నువ్వు చేసే “మంచి”ని నువ్వు మరిచిపోయినా – దైవం మరిచిపోదు.
నువ్వు చేసే “చెడు”ని దైవం క్షమించినా – కర్మ మరిచిపోదు.**
ప్రతి కర్మకు ప్రతిఫలం అనివార్యం.
ఈ సృష్టిలో ఏ పని వృథా కాదు.
మనం వేసే ప్రతి ఆలోచన,
ప్రతి మాట, ప్రతి కార్యం –
విశ్వ చైతన్యంలో నమోదవుతుంది.
సర్వశక్తిమంతుడైన పరమాత్మకు
అనంతమైన జ్ఞానం, అపారమైన శక్తి, అఖండమైన స్మృతి ఉన్నాయి. ఎవరూ చూడరని, ఎవరూ వినరని భావించి
మనిషి చేసే పాపకర్మలను ప్రకృతి మాత, సృష్టికర్త చూస్తూనే ఉంటారు.
…..దైవానికి కాదు – కర్మకు భయపడు..
దైవం క్షమించగలడు…
కానీ కర్మఫలం అనుభవించక తప్పదు.
….విత్తనం – వృక్షం – విధి
చిన్న విత్తనం కాలక్రమంలో మహావృక్షమవుతుంది.
అదేవిధంగా మన కర్మలు కాలంతో పెరిగి
విధి రూపంలో ఫలితమిస్తాయి.
….శాస్త్రాలు దీన్ని విధి.. కాలం అని పేర్కొన్నాయి.
ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయించేది కాలం .
దాన్ని క్రమబద్ధంగా నడిపించేది కాలం.
…..ఈశ్వరునికి ఎవరి మీదా పక్షపాతం లేదు…
పుణ్యానికి పుణ్యఫలం,
పాపానికి పాపఫలం —
సమానంగా, సమయానికి అందించేది ఆయన శక్తి.
….సాధన – ఆత్మపరిశీలన – ఓం ధ్యానం..
మానవ జన్మ మహత్తరమైన వరం.
దాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంది.
ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు
శుద్ధ సంకల్పంతో, పరమాత్మపై ప్రేమతో
ఓం ధ్యానం చేయాలి.
ఓంకార ధ్యానం ద్వారా:
- మనస్సు ప్రశాంతమవుతుంది
- ఒత్తిడి తగ్గుతుంది
- అంతరంగ శక్తి పెరుగుతుంది
- ఆలోచనలు పవిత్రమవుతాయి
మనసును అందాల బృందావనంగా మార్చేది సాధన మాత్రమే.
నీ లోపలికి నీవు ప్రవేశించే మార్గం ధ్యానం ద్వారానే సాధ్యం.
సద్భావనతో జీవిద్దాం.
సత్సంకల్పంతో ఆచరించుదాం.
సత్యం – ధర్మం – ప్రేమ మార్గంలో నడుద్దాం.
శ్రీ సద్గురు పీఠం నుండి….✍
సమస్త లోకా సుఖినో భవంతు🙌
శుభమస్తు👌




