మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు..

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు.
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు..
ఆపత్కాలం..అన్నదానం..
"ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందీ?.." పోయిన సంవత్సరం మార్చి నెల మధ్యలో..
ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా..నేరుగా నేను కూర్చున్న చోటికి వచ్చి అడిగాడు మధ్యవయసులో ఉన్న ఆ వ్యక్తి..ఆ వచ్చినతన్ని ముందు కూర్చోమని చెప్పి..కుర్చీ చూపించాను..
"మీ పేరు?.." అన్నాను..
"నా పేరు చంద్రశేఖర్..నెల్లూరు దగ్గర మా ఊరు.." అన్నాడు.."ఒకప్పుడు బాగా సంపాదించానండీ..రొయ్యల సాగు చేసి మంచి లాభాలే గడించాను..కానీ గత మూడేళ్ళుగా కలిసి రాలేదు..సంపాదించిందంతా నష్టపోవడమే కాకుండా..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను..ఈ మధ్యనే మళ్లీ అప్పుచేసి చెరువుల్లో సీడ్ వేసాను..ఈ పంట చేతికొస్తే నేను నిలబడతాను..లేకుంటే మరణమే శరణ్యం..అంత ఇబ్బందుల్లో వున్నాను.." అన్నాడు..
అంత కష్టం లో వుండి కూడా అన్నదానం చేయిస్తానంటున్నాడు..అదే అర్ధం కాక.."మీరు స్వామివారికి మ్రొక్కుకొని వెళ్ళండి..మీ కష్టాలు తీరిన తర్వాత వచ్చి అన్నదానం చేయించవచ్చు..ఇప్పుడు ఎందుకు?.."అన్నాను..
"గత ఐదు వారాలుగా నేను ఈ మందిరానికి వస్తున్నాను..శ్రీ స్వామివారికి నా కష్టం చెప్పుకున్నాను..ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరగడం చూస్తున్నాను..నేనుకూడా ఒకవారం అన్నదానం చేయిస్తే..నా కష్టాలు తీరుతాయేమోనని ఒక భావన నిన్నరాత్రి కలిగింది..ఇంట్లో మా ఆవిడ కూడా ఒక వారం అలా చేయించండి..మంచి జరగొచ్చు అని చెప్పింది..అందుకోసం అడుగుతున్నాను..ఎంత ఖర్చు అవుతుందీ?.."అన్నాడు..
మళ్లీ కూడా చెప్పి చూసాను..తన కున్న కష్టాలు తొలిగిన తర్వాతే అన్నదానం చేయించమని..అంతవరకూ శ్రీ స్వామివారిని నమ్మకంతో కొలవమని కూడా చెప్పాను..కానీ చంద్రశేఖర్ పట్టు బట్టాడు..వచ్చే ఆదివారం నాడు తాను ఆ ఖర్చు భరిస్తాననీ..చెప్పడమే కాకుండా ఆ ప్రక్క ఆదివారం నాటి అన్నదానపు ఖర్చంతా తానే భరించాడు..
సరిగ్గా మూడు నెలల అనంతరం ఆ చంద్రశేఖర్ సంతోషం తో మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..వనామీ సాగులో మంచి లాభాలే వచ్చాయనీ..తనకున్న అప్పుల్లో ఎనభై శాతం తీరిపోయాయని..చెప్పుకొచ్చాడు..
అన్నదానం చేయించినందువల్ల చంద్రశేఖర్ కష్టాలనుంచి గట్టెక్కాడా?.. శ్రీ స్వామివారిని నమ్మినందుకు లబ్ది పొందాడా?..ఏమీ అర్ధం కాలేదు నాకు..అదే మాట అడిగాను..
"నా కష్టాలు తీరాలంటే..నా చేత అన్నదానం చేయించాలని శ్రీ స్వామివారే నాకు ఆ బుద్ధి పుట్టించాడని మీరెందుకు ఆలోచన చేయలేదు?.." అని ఎదురు ప్రశ్నించాడు..
నిజమే..ఎవరికి ఏది ఎప్పుడు ఎలా నిర్దేశించాలో శ్రీ స్వామివారికే తెలుసు..
సర్వం..
దత్తకృప.
శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ఏర్పాట్లు కొఱకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ : పవని కృష్ణ కిరీటి : 72078 75712
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం…లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
తరచుగా అడిగే ప్రశ్నలు
మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం ఎక్కడ ఉంది?
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలం, మొగలిచెర్ల గ్రామంలో ఉంది. పిన్ కోడ్ 523 114.
మొగలిచెర్ల మందిరంలో అన్నదానం ఎప్పుడు జరుగుతుంది?
మొగలిచెర్ల శ్రీ స్వామివారి మందిరంలో ప్రతి వారం అన్నదానం జరుగుతుంది. భక్తులు ఆదివారం మధ్యాహ్నం అన్నదానం ఖర్చు భరించి చేయించవచ్చు.
చంద్రశేఖర్ అనుభవం ఏమిటి?
నెల్లూరు దగ్గర ఊరికి చెందిన రొయ్యల రైతు చంద్రశేఖర్ మూడేళ్ళ నష్టాలతో అప్పుల్లో ఉండి కూడా ఒక ఆదివారం అన్నదానం ఖర్చు భరించారు. మూడు నెలల తర్వాత వనామీ సాగులో లాభాలు వచ్చి అప్పుల్లో ఎనభై శాతం తీరిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు.
కష్టాల్లో ఉన్నప్పుడు అన్నదానం ఎందుకు చేయించారు?
అన్నదానం చేయించాలనే బుద్ధిని శ్రీ స్వామివారే పుట్టించారని చంద్రశేఖర్ విశ్వాసం. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా నిర్దేశించాలో శ్రీ స్వామివారికే తెలుసు, సర్వం దత్తకృప అని భక్తులు భావిస్తారు.
మందిరం వద్ద ఏర్పాట్ల కోసం ఎవరిని సంప్రదించాలి?
ఏర్పాట్ల కొఱకు పవని కృష్ణ కిరీటి గారిని 72078 75712 నంబరులో సంప్రదించవచ్చు. పవని నాగేంద్ర ప్రసాద్ గారి సెల్ నంబర్లు 94402 66380 & 99089 73699.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- అమెరికా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉపవాసం & పూజా విధానాలు
- అమెరికాలోని హిందువుల కోసం వైకుంఠ ఏకాదశి 2026 గైడ్: తేదీలు, ఉపవాసం, ఆలయాలు & పూజా విధానం
- ఏకాదశ రుద్రాభిషేకం: ప్రయోజనాలు, విధానం & ప్రాముఖ్యతకు సంపూర్ణ మార్గదర్శి
- 2026లో శ్రీ రాధాకృష్ణులను ఎలా పూజించాలి: మంత్రాలు, పూజలు, ముఖ్యమైన తేదీలు, ఆలయాలు & ఆచారాలు | HinduTone
- దైవ సంకల్పం: మునిగిపోతున్న పడవలో బాబాజీ కథ

