అర్చకుని ఓ చిన్న కోరిక

నమస్కారం.నా పేరు వారణాసి మహాదేవ శాస్త్రి. వంశపారంపర్యంగా శివారాధన వృత్తిని కొనసాగిస్తున్నాను. చిన్ననాటి నుంచే ఈ మార్గంలో నడుస్తున్నాను. నాన్నగారు యింగ్లీషు చదువు మానిపించి, ఆగమ శాస్త్రాలపై నన్ను దృష్టి పెట్టించారు. అయిదేళ్ళ పాటు సంపూర్ణంగా
నమస్కారం.
నా పేరు వారణాసి మహాదేవ శాస్త్రి. వంశపారంపర్యంగా శివారాధన వృత్తిని కొనసాగిస్తున్నాను. చిన్ననాటి నుంచే ఈ మార్గంలో నడుస్తున్నాను. నాన్నగారు యింగ్లీషు చదువు మానిపించి, ఆగమ శాస్త్రాలపై నన్ను దృష్టి పెట్టించారు. అయిదేళ్ళ పాటు సంపూర్ణంగా ఆర్చక విద్యలన్నీ అభ్యసించి, గత నలభై ఏళ్ళుగా శివసేవలో లీనమై ఉన్నాను. లక్షలూ, కోట్లు సంపాదించలేకపోయినా, పరమేశ్వరుని కృపతో జీవితం సజీవంగా సాగుతోంది.
ఇంతకీ అసలు విషయానికి వస్తాను.
ప్రతి రోజు అనేక మంది భక్తులు ఆలయానికి వస్తారు. హారతి కోసం కర్పూరం, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కొందరైతే నూనె కూడా తీసుకువచ్చి సమర్పిస్తారు. ఇది భక్తిశ్రద్ధగా అనిపిస్తుంది. కానీ, ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి.
ఈ పూజా ద్రవ్యాల్లో చాలావాటి లోనూ కల్తీ ఉంది.
చాలా దురదృష్టంగా చెప్పాల్సి వస్తోంది – దేవుడికి సమర్పించే పదార్థాలు, అత్యంత హేయంగా తయారవుతున్నాయి. ఆ కర్పూరంలోనూ, ఆ అగరబత్తీలలోనూ, ఆ నూనెలోనూ మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేసే రసాయనాలు కలిసిపోతున్నాయి.
మనమేనండి, రోజూ ఆ హారతిలో వాడే విభూతి కూడా నకిలీది. నిజానికి అది విభూతి కాదు – సున్నపు ముద్ద. ఈ విభూతిని రోజూ ధరిస్తూ, అనేకమంది అర్చకులు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. ఆ అగరబత్తీలు వెలిగిస్తూ, వాటి వాసన పీల్చుతూ ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. కొంతమంది ప్రాణాలనేం కోల్పోయారు.
ఇంకో విషయం — దీపారాధన కోసం తీసుకురాబడే నూనెలలో, చనిపోయిన జంతువుల కొవ్వు కలిపి తయారు చేస్తున్నారంటే, మీరు నమ్మగలరా? ఈ వాసనలు మన ఆరోగ్యానికే కాదు, గర్భగుడిలో పనిచేస్తున్న అర్చకుల ఆరోగ్యానికీ చీమ జేస్తున్నాయి.
ప్రశ్నించండి మీరే:
ఈ కల్మషమైన, కల్తీ పదార్థాలతో పూజ చేసి దేవుడు ప్రసన్నుడవుతాడా?
అవసరమా ఆయనకు మనం సమర్పించే పదార్థాలన్నీ?
సృష్టి అంతా ఆయనదైతే, మనం ఏమిచ్చేది?
ఒక నిర్జనమైన ప్రాంగణంలో, నిష్కల్మషమైన హృదయంతో, మౌన ధ్యానంలో చేసిన ఒక నమస్కారమే చాలుకదా దేవుని అనుగ్రహానికి?
ఇకనైనా ఆలోచించండి.
పూజా సామగ్రిని కొనే ముందు జాగ్రత్త వహించండి.
ఆ పదార్థాలు నిష్కళుషంగా ఉండేలా చూసుకోండి.
మీ భక్తి రసాయనికాల ఆవరణలో చిక్కుకోకుండా ఉండాలి.
మా అర్చకుల ఆరోగ్యం కూడా మీ చిటికెడు జాగ్రత్త మీద ఆధారపడి ఉంది.
హర హర మహాదేవ!
జై శ్రీరాం!
భవదీయుడు,
వారణాసి మహదేవ శాస్త్రి
తరచుగా అడిగే ప్రశ్నలు
పూజా ద్రవ్యాల్లో కల్తీ ఎందుకు ప్రమాదకరం?
కర్పూరం, అగరబత్తీలు, నూనెలో మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేసే రసాయనాలు కలుస్తున్నాయని అర్చకులు వారణాసి మహాదేవ శాస్త్రి చెబుతారు. ఆ వాసనలు భక్తులకే కాదు, గర్భగుడిలో పనిచేసే అర్చకుల ఆరోగ్యానికీ హాని చేస్తున్నాయి.
నకిలీ విభూతి వల్ల అర్చకులకు ఏ సమస్యలు వస్తున్నాయి?
హారతిలో వాడే విభూతి చాలాసార్లు నిజమైనది కాదు, సున్నపు ముద్ద. దాన్ని రోజూ ధరిస్తూ అనేకమంది అర్చకులు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు; అగరబత్తీల వాసన పీల్చి ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు.
దీపారాధన నూనె విషయంలో అర్చకుని హెచ్చరిక ఏమిటి?
దీపారాధన కోసం తీసుకువచ్చే నూనెల్లో చనిపోయిన జంతువుల కొవ్వు కలిపి తయారు చేస్తున్నారని ఆయన హెచ్చరిస్తారు. అలాంటి నూనె వాసనలు ఆరోగ్యానికి హానికరం.
పూజా సామగ్రి కొనేటప్పుడు భక్తులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
కొనే ముందు జాగ్రత్త వహించి, పదార్థాలు నిష్కల్మషంగా ఉండేలా చూసుకోవాలి. అర్చకుల ఆరోగ్యం కూడా భక్తుల చిటికెడు జాగ్రత్త మీద ఆధారపడి ఉంది.
దేవుని అనుగ్రహానికి పూజా ద్రవ్యాలు తప్పనిసరా?
సృష్టి అంతా దేవునిదే అయినప్పుడు మనం ఏమివ్వగలమని శాస్త్రి ప్రశ్నిస్తారు. నిష్కల్మషమైన హృదయంతో, మౌన ధ్యానంలో చేసిన ఒక నమస్కారమే దేవుని అనుగ్రహానికి చాలని ఆయన భావన.
వారణాసి మహాదేవ శాస్త్రి ఎవరు?
వంశపారంపర్యంగా శివారాధన వృత్తిని కొనసాగిస్తున్న అర్చకులు. అయిదేళ్ల పాటు ఆగమ శాస్త్రాలు, అర్చక విద్యలు అభ్యసించి, గత నలభై ఏళ్లుగా శివసేవలో ఉన్నారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- ఆత్మజ్ఞానానికి అడ్డుగోడ అహంకారం | అహం తొలగితేనే నిజమైన జ్ఞానం
- అమెరికా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉపవాసం & పూజా విధానాలు
- అమెరికాలోని హిందువుల కోసం వైకుంఠ ఏకాదశి 2026 గైడ్: తేదీలు, ఉపవాసం, ఆలయాలు & పూజా విధానం
- ఏకాదశ రుద్రాభిషేకం: ప్రయోజనాలు, విధానం & ప్రాముఖ్యతకు సంపూర్ణ మార్గదర్శి
- 2026లో శ్రీ రాధాకృష్ణులను ఎలా పూజించాలి: మంత్రాలు, పూజలు, ముఖ్యమైన తేదీలు, ఆలయాలు & ఆచారాలు | HinduTone




