10-11-2025 సోమవారం రాశి ఫలితాలు

♈ మేషం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటి–బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
♉ వృషభం
నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందు–వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు యోగం ఉంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు కలుగుతాయి.
♊ మిథునం
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
♋ కర్కాటకం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
♌ సింహం
వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
♍ కన్యా
కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ–వాహన యోగం ఉంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
♎ తులా
వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ–విక్రయాలలో లాభాలు పొందుతారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశ ఆహ్వానాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
♏ వృశ్చికం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
♐ ధనుస్సు
వృత్తి, వ్యాపారాలలో స్థాన చలన సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆలయ సందర్శనం చేస్తారు.
♑ మకరం
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి యోగం ఉంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
♒ కుంభం
వ్యాపార, ఉద్యోగ సమస్యలు తొలగుతాయి. పూర్తికాని పనులు పూర్తి అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు–వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సంతాన విద్య–ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
♓ మీనం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
🕉️ ధర్మ ప్రచారం — AVB ధర్మ ప్రచారం 🕉️
