03 జూలై 2025గురువారం | రాశి ఫలితాలు- జ్యోతిష్య మార్గదర్శనం

🐏 మేషం
ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకి దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కనిపిస్తాయి.
🐂 వృషభం
ఆర్థికంగా అంతంతమాత్రమే. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట్లో, బయట గందరగోళం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో విమర్శలు తట్టుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు.
👥 మిధునం
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తిలో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యలో కొత్త అవకాశాలు. ఉద్యోగాలలో పదోన్నతులు. ఆర్థికంగా అనుకూలత.
🦀 కర్కాటకం
సోదరులతో ఆస్తి వివాదాలు. బంధుమిత్రులతో కలహాలు పరిష్కార దిశగా. ముఖ్య వ్యవహారాల్లో ఫలితాలు ఆలస్యం. ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్త. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వృత్తిలో అదనపు పనిభారం.
🦁 సింహం
ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాని పూర్తవుతాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభదాయకం. ఋణ సమస్యల నుంచి ఉపశమనం.
👧 కన్యా
రుణ నివృత్తికి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ కార్యక్రమాలు వేగం పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆటంకాల మధ్యన పనులు పూర్తవుతాయి. అవసరానికి ధనం అందుతుంది.
⚖️ తులా
కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి మద్దతు. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలత. స్నేహితులతో విందు వినోదం. విలువైన వస్తువులు కొనుగోలు. నిరుద్యోగులకు శుభవార్తలు.
🦂 వృశ్చికం
ఆర్థికంగా నిరాశ కలిగించే రోజు. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఉద్యోగాలలో బదిలీల సూచనలు. ప్రయాణాల వాయిదా మంచిది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
🏹 ధనుస్సు
భూమి వివాదాల్లో ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు లాభదాయకం. ఆటంకాల మధ్య పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగాల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవలు చేస్తారు.
🐊 మకరం
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందుతారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు. ముఖ్య పనులు సులభంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు. వాహన కొనుగోలు సూచనం.
🌊 కుంభం
సంతాన ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు అదుపులో పెట్టడం కష్టం. వ్యవహారాల్లో మందకూడుదనం. వ్యాపారాల్లో చిన్నచిన్న గొడవలు. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు. విద్యలో సంతానంపై దృష్టి సారించాలి.
🐟 మీనం
ఇంటా బయట అనుకూల వాతావరణం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
🔹 ముక్తినూతలపాటి వాసు 🔹