బుధవారం 17 జూన్ 2026 రాశిఫలాలు | నేటి రాశిఫలాలు
🌹━━❀ ☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️ ❀━━🌹 📅 నేటి రాశిఫలాలు – 17-06-2026 | బుధవారం 👤 వాసు ముక్తినూతలపాటి📞 ఫోన్: 99497 22792 ❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀ ♈ మేషం మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు.
🌹━━❀ ☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️ ❀━━🌹
📅 నేటి రాశిఫలాలు – 17-06-2026 | బుధవారం
👤 వాసు ముక్తినూతలపాటి
📞 ఫోన్: 99497 22792
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
♈ మేషం
మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలన సూచనలున్నవి.
━━━━━━━━━━━━━━━━━━━━
♉ వృషభం
దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
━━━━━━━━━━━━━━━━━━━━
♊ మిధునం
చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━━
♋ కర్కాటకం
సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
━━━━━━━━━━━━━━━━━━━━
♌ సింహం
కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━━
♍ కన్య
వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నూతన ఋణయత్నాలు కలసిరావు. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━━
♎ తుల
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━━
♏ వృశ్చికం
సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య సమాచారం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి.
━━━━━━━━━━━━━━━━━━━━
♐ ధనస్సు
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━━
♑ మకరం
ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
━━━━━━━━━━━━━━━━━━━━
♒ కుంభం
సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విషయంలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━━
♓ మీనం
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
🌸 సర్వేజనాః సుఖినోభవంతు
🌸 సమస్త సన్మంగళాని భవంతు
╚══❀🍁🕉️🌿❀══╝🌻╚══❀🕉️🍁🌿❀══╝

