12 ఆగస్టు 2025 | మంగళవారం రాశి ఫలితాలు

రాశి ఫలితాలు – 12-08-2025 / మంగళవారం ♈ మేషంమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఎదుర్కొంటారు.
రాశి ఫలితాలు – 12-08-2025 / మంగళవారం
♈ మేషం
మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఇంటి బయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
♉ వృషభం
ఉద్యోగ సమస్యల నుండి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో దైవ దర్శనాలు చేస్తారు. నూతన వాహన యోగం ఉంది.
♊ మిధునం
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధువులతో వివాదాలు కలుగుతాయి. వ్యర్థ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.
♋ కర్కాటకం
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగ సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
♌ సింహం
పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభం పొందుతారు. కొత్త పరిచయాలు ఉపయోగకరంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది.
♍ కన్యా
స్వల్ప అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగక నిరుత్సాహం పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
♎ తులా
మొండి బాకీలు వసూలు అవుతాయి. దాయాదులతో భూవివాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఉంటుంది.
♏ వృశ్చికం
బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో నిరాశ తప్పదు. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రుల వల్ల ఒత్తిడులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు కలుగుతాయి.
♐ ధనుస్సు
కొన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడికి దారి తీస్తాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.
♑ మకరం
ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ముందుకు వెళ్లాలి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.
♒ కుంభం
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటి, బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో కొంత గందరగోళం ఉంటుంది. ఉద్యోగ సమస్యలు తొలగుతాయి.
♓ మీనం
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉంటాయి. కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేస్తారు.
🍁 శుభం భూయాత్ 🍁




