2025 జూలై 9 రాశిఫలాలు

ఆధారంగా: జ్యోతిష శాస్త్రం & పంచాంగ గణన 🐏 మేషం చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి.
ఆధారంగా: జ్యోతిష శాస్త్రం & పంచాంగ గణన
🐏 మేషం
చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి జీవితంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
🐂 వృషభం
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తొందరపడకండి. స్వల్ప అనారోగ్యం కలగవచ్చు. వ్యాపారాలు నిదానంగా సాగతాయి. సహోద్యోగులతో మాటపట్టింపులు సంభవిస్తాయి.
👥 మిథునం
పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట శ్రమ అధికమవుతుంది. ఆధ్యాత్మికతపై దృష్టి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. నిరుద్యోగులకు సమర్థ ప్రయత్నాలైనా ఫలితం తక్కువ. వ్యాపారాలు మందగిస్తాయి.
🦀 కర్కాటకం
ప్రధాన విషయాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబంతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
🦁 సింహం
సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా కష్టాలున్నా, నూతన ఋణ ప్రయత్నాలు అవసరమవుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కావచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతికి కొదువ.
👧 కన్య
భూ వ్యవహారాలలో లాభం. కుటుంబ సభ్యుల నుంచి అకస్మాత్తుగా ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
⚖ తుల
ఋణ భారం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు. వ్యాపార నిర్ణయాల్లో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యకరం. వృత్తిలో సాధారణ ఫలితాలు మాత్రమే.
🦂 వృశ్చికం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు. వృత్తిలో కీలక సమాచారం సేకరణ. చిన్ననాటి మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తిలో మంచి పరిస్థితులు. నూతన వాహన కొనుగోలు విజయవంతం.
🏹 ధనస్సు
పనుల్లో విజయాలు. నిరుద్యోగ యత్నాల వేగం పెరుగుతుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు. ఉద్యోగంలో బాధ్యతల నుంచి ఉపశమనం.
🐊 మకరం
వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం. వృత్తిలో ఊహించని సమస్యలు. నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు.
🌊 కుంభం
పనులు మందగమనం కలిగి ఉంటాయి. వ్యాపార నిర్ణయాల్లో మార్పులు చేయవలసివస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. బంధువులతో చిన్న విభేదాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు అధిక శ్రమ అవసరం.
🐟 మీనం
వ్యాపారాలు లాభదాయకంగా సాగతాయి. ఉద్యోగంలో పదోన్నతుల అవకాశాలు. సన్నిహితులతో సఖ్యతగా మెలుగుతారు. సోదరుల నుంచి ప్రత్యేక ఆహ్వానాలు. వృత్తిలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు. విలువైన వస్తువుల లాభం.
శ్రీ గురుభ్యోనమః🙏☘️
ముక్తినూతలపాటి వాసు
తరచుగా అడిగే ప్రశ్నలు
2025 జూలై 9న ఏ రాశుల వారికి వ్యాపారంలో లాభం సూచించబడింది?
మేషం, కర్కాటకం, కన్య, ధనస్సు, మీనం రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో పురోగతి, లాభదాయక పరిస్థితులు సూచించబడ్డాయి.
2025 జూలై 9న ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు?
వృషభం, మిథునం, సింహం, మకరం రాశుల వారికి పనుల్లో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరమని సూచించారు. తుల రాశి వారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
2025 జూలై 9న ఉద్యోగులకు ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఉన్నాయి?
కర్కాటక రాశి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, మీన రాశి వారికి పదోన్నతుల అవకాశాలు, ధనస్సు రాశి వారికి బాధ్యతల నుంచి ఉపశమనం సూచించబడ్డాయి.
2025 జూలై 9న నిరుద్యోగులకు ఏ రాశుల్లో అనుకూలత ఉంది?
కన్య రాశి నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయని, ధనస్సు రాశి వారికి నిరుద్యోగ యత్నాల వేగం పెరుగుతుందని సూచించారు. మిథునం, మకరం రాశుల వారికి ఫలితం తక్కువగా ఉంటుందని చెప్పారు.
2025 జూలై 9న వాహనం లేదా విలువైన వస్తువుల కొనుగోలు ఏ రాశులకు అనుకూలం?
మేష రాశి వారు విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారని, వృశ్చిక రాశి వారికి నూతన వాహన కొనుగోలు విజయవంతమవుతుందని సూచించారు.
ఈ రాశిఫలాలు దేని ఆధారంగా ఇచ్చారు?
ఈ రాశిఫలాలు జ్యోతిష శాస్త్రం, పంచాంగ గణన ఆధారంగా ముక్తినూతలపాటి వాసు అందించారు. ఇవి సూచనలు మాత్రమే, ఫలితాలకు హామీ కాదు.




