సంధ్యావందనం మరియు ఇతర పూజా కార్యక్రమాల సంకల్పము — తేది 10.06.2026, బుధ వారం (సౌమ్య వాసరే). పంచాంగ ఘడియలు దృగ్గణిత ప్రకారం (విజయవాడ/హైదరాబాద్).

గమనిక: ఇక్కడ ఇచ్చిన సంకల్పం పెద్దలు, గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. మీ ప్రదేశం మరియు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధానం ప్రకారం దీనిని మార్చుకోవచ్చును. పంచాంగ ఘడియలు స్థల భేదాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు.

సంధ్యావందన సంకల్పం

... శ్రీ పరాభవ నామ సంవత్సరే, ఉత్తరాయణే, గ్రీష్మ ఋతౌ, అధిక జ్యేష్ఠ మాసే, కృష్ణ పక్షే, దశమ్యాం, సౌమ్య వాసరే, ఉత్తరాభాద్ర నక్షత్రే, ఆయుష్మాన్ యోగే, వణజి కరణ ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిథౌ — శ్రీమాన్ _____ గోత్రః _____ నామధేయః మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాముపాసిష్యే.

Advertisement

పంచాంగ వివరాలు (10.06.2026, బుధ వారం)

  • సూర్యోదయం: విజయవాడ ఉ.5.34 — అస్తమయం సా.6.40; హైదరాబాద్ ఉ.5.41 — అస్తమయం సా.6.50
  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం
  • అయనం: ఉత్తరాయణం — ఋతువు: గ్రీష్మ ఋతువు
  • మాసం: అధిక జ్యేష్ఠ మాసం — పక్షం: కృష్ణ పక్షం
  • తిథి: దశమి — రా.12.57 వరకు; అనంతరం ఏకాదశి
  • నక్షత్రం: ఉత్తరాభాద్ర — ఉ.9.21 వరకు; అనంతరం రేవతి
  • యోగం: ఆయుష్మాన్ — ఉ.6.30 వరకు; అనంతరం సౌభాగ్యం (రా.తె.4.03 వరకు)
  • కరణం: వణజి — మ.1.52 వరకు; అనంతరం భద్ర (విష్టి) రా.12.57 వరకు; అనంతరం బవ
  • వర్జ్యం: రా.8.49 ల 10.20 వరకు
  • దుర్ముహూర్తం: ప.11.41 ల 12.33 వరకు
  • అమృత ఘడియలు: శేషం ఉ.6.12 వరకు
  • రాహు కాలం: మ.12.07 ల 1.45 వరకు
  • యమగండ కాలం: ఉ.7.12 ల 8.51 వరకు
  • గుళిక కాలం: ఉ.10.29 ల మ.12.07 వరకు
  • అభిజిత్ ముహూర్తం: ఈరోజు లేదు
  • ప్రయాణశూల: ఉత్తర దిక్కుకు పనికిరాదు
  • సూర్యరాశి: వృషభం — చంద్రరాశి: మీనం
  • శాలివాహన శకం 1948 · విక్రమ శకం 2083 · కల్యబ్దం 5127 · ఆంగ్ల సంవత్సరం 2026-27

సాధారణ శుభ సమయాలు

  • ఉ.5.30 — 7.30
  • ఉ.9.00 — 10.00

వైదిక కాల విభజన

  • ప్రాతః కాలం: ఉ.5.34 — 8.11
  • సంగవ కాలం: 8.11 — 10.48
  • మధ్యాహ్న కాలం: 10.48 — మ.1.25
  • అపరాహ్న కాలం: మ.1.25 — 4.03
  • సాయంకాలం: సా.4.03 — 6.40
  • ప్రదోష కాలం: సా.6.40 — రా.8.51
  • రాత్రి కాలం: రా.8.51 — 11.45
  • నిశీధి కాలం: రా.11.45 — 12.29
  • బ్రాహ్మీ ముహూర్తం: తె.4.07 — 4.51
  • ఆబ్ధికం తిథి: అధిక జ్యేష్ఠ బహుళ దశమి

బుధ వారం కావున రాహు కాలం, యమగండం, గుళిక కాలములను గమనించి శుభ కార్యములను శుభ ముహూర్తములలో చేపట్టడం శ్రేయస్కరం. — వాసు ముక్తినూతలపాటి