10 జూన్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దినఫలాలు
10 జూన్ 2026, బుధవారం నాటి మేషం నుండి మీనం వరకు 12 రాశుల దినఫలాలు — వృత్తి, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం గురించి గోచార ఫలితాలు.

10 జూన్ 2026, బుధవారం నాటి ద్వాదశ రాశుల (12 రాశుల) దినఫలాలు. శ్రీ గురుభ్యోనమః 🙏 — మీ జన్మరాశి లేదా చంద్రరాశి ఆధారంగా ఈరోజు ఫలితాలను చదవండి.
మేషం
అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
వృషభం
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.
మిధునం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.
కర్కాటకం
సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం
వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య
చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.
తుల
భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం
ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.
కుంభం
బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.
మీనం
సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంబంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
గమనిక: ఇవి సాధారణ గోచార ఫలితాలు. వ్యక్తిగత జాతక విశ్లేషణకు మీ జ్యోతిష్కుని సంప్రదించండి. — వాసు ముక్తినూతలపాటి
తరచుగా అడిగే ప్రశ్నలు
10 జూన్ 2026 బుధవారం ఏ రాశులకు అనుకూల ఫలితాలు సూచించబడ్డాయి?
మిధునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం రాశులకు ఆ రోజు అనుకూల సూచనలు ఇవ్వబడ్డాయి — పనులు సకాలంలో పూర్తి కావడం, శుభవార్తలు, స్థిరాస్తి లాభాలు వంటివి. ఇవి సాధారణ గోచార ఫలితాలు మాత్రమే.
10 జూన్ 2026న ఏ రాశుల వారికి జాగ్రత్త సూచించబడింది?
వృషభం (ఆరోగ్యం, ప్రయాణాలు), సింహం, కన్య, ధనస్సు, మకరం, మీనం రాశులకు అవరోధాలు, ఆర్థిక ఒత్తిడి లేదా వివాదాల విషయంలో జాగ్రత్త సూచించబడింది.
10 జూన్ 2026న మేష రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి?
మేష రాశి వారికి సన్నిహితుల సహాయం, లాభసాటి వ్యాపారం సూచించబడ్డాయి. పనులలో జాప్యం ఉన్నా నిదానంగా పూర్తిచేస్తారని, కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పబడింది.
10 జూన్ 2026న నిరుద్యోగులకు ఏ రాశులలో శుభ సూచనలు ఉన్నాయి?
కర్కాటక రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు, తుల రాశి నిరుద్యోగులకు శుభవార్తలు సూచించబడ్డాయి. వృషభ రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావని చెప్పబడింది.
ఈ దినఫలాలను ఏ రాశి ఆధారంగా చూడాలి?
మీ జన్మరాశి లేదా చంద్రరాశి ఆధారంగా ఫలితాలు చూడాలి. ఇవి సాధారణ గోచార ఫలితాలు; వ్యక్తిగత జాతక విశ్లేషణకు మీ జ్యోతిష్కుని సంప్రదించండి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- గృహ ప్రవేశ ముహూర్తం 2026-27: నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు గృహప్రవేశం తేదీలు (న్యూఢిల్లీ, హైదరాబాద్, దృక్ పంచాంగం ప్రకారం)
- వివాహ ముహూర్తాలు 2026-27: నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు శుభ వివాహ తేదీలు (న్యూఢిల్లీ, హైదరాబాద్, దృక్ పంచాంగం ప్రకారం)
- 23 అక్టోబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 22 అక్టోబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశులకు నేటి దిన ఫలాలు
- 20 అక్టోబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు


