రాశిఫలాలు 14 ఆగస్టు 2026 (శుక్రవారం): 12 రాశుల దినఫలాలు
14 ఆగస్టు 2026, శుక్రవారం నాటి పన్నెండు రాశుల దినఫలాలు — మేషం నుండి మీనం వరకు వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు.

14 ఆగస్టు 2026, శుక్రవారం నాటి పన్నెండు రాశుల దినఫలాలు — మేషం నుండి మీనం వరకు వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు.
సంక్షిప్త సమాధానం: 14 ఆగస్టు 2026 శుక్రవారం నాటి రాశిఫలాలు: మిధునం, కర్కాటకం, తుల, కుంభం, మీనం రాశులకు అనుకూలం; సింహం, కన్య, మకరం రాశులవారు ఒత్తిడి, ఆరోగ్యం, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
14-08-2026, శుక్రవారం నాటి రాశిఫలాలు — పండిత వాసు ముక్తినూతలపాటి అందించిన దినఫలాలు. మీ జన్మ రాశి ప్రకారం ఈరోజు వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, కుటుంబ ఫలితాలను తెలుసుకోండి.
మేషం రాశి
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి.
వృషభం రాశి
చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.
మిధునం రాశి
సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కర్కాటకం రాశి
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
సింహం రాశి
ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.
కన్య రాశి
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
తుల రాశి
బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
వృశ్చికం రాశి
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ధనస్సు రాశి
నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
మకరం రాశి
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.
కుంభం రాశి
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.
మీనం రాశి
చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
సర్వేజనాః సుఖినోభవంతు — సమస్త సన్మంగళాని భవంతు. (గమనిక: ఇవి సాంప్రదాయ జ్యోతిష దినఫలాలు; భక్తి, మార్గదర్శన ఉద్దేశంతో అందించబడ్డాయి.)
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈరోజు (14 ఆగస్టు 2026) ఏ రాశులకు అనుకూలం?
మిధునం, కర్కాటకం, తుల, కుంభం, మీనం రాశులకు వ్యాపార, ఆర్థిక, కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు సూచించబడ్డాయి.
ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
సింహం, కన్య, మకరం రాశులవారు పని ఒత్తిడి, ఆరోగ్యం, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఈ రాశిఫలాలు ఎవరు అందించారు?
ఈ దినఫలాలను పండిత వాసు ముక్తినూతలపాటి అందించారు; 14-08-2026 శుక్రవారం నాటివి.
రాశిఫలాలు ఎలా చదవాలి?
మీ జన్మ రాశి (చంద్ర రాశి) ప్రకారం చదవడం సంప్రదాయం. తెలియకపోతే మీ పంచాంగం లేదా పురోహితుడిని సంప్రదించండి.
మేషం రాశివారికి ఈరోజు ఎలా ఉంటుంది?
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం, ఆరోగ్య ఇబ్బందులు ఉండవచ్చు; దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి, దూరప్రయాణ సూచనలున్నాయి.
ధనస్సు రాశివారికి ఉద్యోగ ఫలితాలు ఎలా ఉన్నాయి?
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు, ఉద్యోగులకు పదోన్నతులు సూచించబడ్డాయి; అవసరానికి కొత్త ఋణ ప్రయత్నాలు చేయవచ్చు.
ఇవి కచ్చితమైన జోస్యాలా?
ఇవి సాంప్రదాయ జ్యోతిష దినఫలాలు, మార్గదర్శన ఉద్దేశంతో అందించబడ్డాయి; నిర్ణయాలకు వ్యక్తిగత జాతక పరిశీలన శ్రేయస్కరం.
రోజువారీ రాశిఫలాలు ఎక్కడ చూడవచ్చు?
హిందుటోన్ ఆస్ట్రాలజీ విభాగంలో ప్రతిరోజూ రాశిఫలాలు, పంచాంగం అందుబాటులో ఉంటాయి.

