పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం

పదిమందికి సహాయపడాలంటే ఎంత డబ్బు అవసరం? ఒకసారి, ఓ పేదవాడు బుద్ధుని వద్దకు వచ్చి అడిగాడు: "భగవంతుడా!
పదిమందికి సహాయపడాలంటే ఎంత డబ్బు అవసరం?
ఒకసారి, ఓ పేదవాడు బుద్ధుని వద్దకు వచ్చి అడిగాడు:
"భగవంతుడా! నేను ఎందుకు పేదవాడిని?"
బుద్ధుడు నిశ్శబ్దంగా నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు:
"నీవు పేదవాడివి కాదు, ఔదార్యాన్ని ప్రదర్శించని వాడివి. దానం చేసే ధర్మాన్ని అవలంబించని వాడివి. అందుకే నీలో వెలితి ఉంది."
అప్పుడు ఆ వ్యక్తి బాధతో ఇలా అన్నాడు:
"ఒక పేదవాడిని నేను... ఇతరులకు దానం చేయడానికి నాదగ్గర ఏముంది?"
అప్పుడు బుద్ధుడు మృదుస్మితంతో చెప్పారు:
"నీవద్ద ఐదు నిధులు ఉన్నాయి... నీవు గుర్తించలేదంతే!"
ఆయే ఐదు సంపదలు:
🌼 1. నీ ముఖం
నీవు ఆనందంగా నవ్వుతూ ఇతరుల హృదయాల్లో వెలుగు నింపగలవు. ఇది ఉచితం, కానీ ఎంతో మాయాజాలాన్ని కలిగించే శక్తి కలది.
👁️ 2. నీ కళ్ళు
నీ కళ్ల ద్వారా నీవు ప్రేమతో, శ్రద్ధతో, మానవత్వంతో ఇతరులను చూడగలవు. ఒక సహజ స్పర్శలేని ఆలింగనం!
🗣️ 3. నీ నోరు
మంచి మాటలు, ప్రేరణాత్మక మాటలు, ఓదార్పు ఇచ్చే మాటలు చెప్పగల శక్తి నీ నోటిలో ఉంది. ఈ శక్తి ఓ గుడ్డివారికి చూపుల్లా పనిచేస్తుంది.
❤️ 4. నీ హృదయం
నీవు ఇతరుల బాధలను అర్థం చేసుకుని, వారి కోసం ప్రార్థించగలవు. నీవు సత్యాన్వేషణతో జీవించినప్పుడు నీ గుండెలో భగవంతుడు వాసం చేస్తాడు.
💪 5. నీ శరీరం
నీ చేతులు, నీ కాళ్లు, నీ శక్తి... ఇవన్నీ ఉపయోగించి నీవు వృద్ధులకు సహాయం చేయవచ్చు, పిల్లల్ని గమ్యానికి చేర్చవచ్చు, మొక్కలు నాటవచ్చు, పునీత పనులు చేయవచ్చు.
తీర్పు
సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు.
ఒక నవ్వు, ఒక మాట, ఒక కనసూచి, ఒక చిన్న సహాయం... ఇవి ఎవరి జీవితాన్నైనా వెలిగించగలవు.
మన జీవితం భగవంతుడిచ్చిన ఒక విలువైన వరం.
ఆ జీవితాన్ని:
- ఆనందంగా జీవిద్దాం
- పదిమందికి సహాయం చేద్దాం
- మన మనవతను నిజంగా జీవిద్దాం
ఈ విధంగా మన మానవ జన్మను సార్థకం చేసుకుందాం!
చివరగా –
"ప్రతి చిన్న సహాయం ఓ మహాసేవ!"
తరచుగా అడిగే ప్రశ్నలు
డబ్బు లేకుండా ఇతరులకు సహాయం చేయవచ్చా?
ప్రచారంలో ఉన్న బుద్ధుని కథ ప్రకారం సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు. ఒక నవ్వు, ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్నైనా వెలిగించగలవు.
నేను ఎందుకు పేదవాడిని అని అడిగినప్పుడు బుద్ధుడు ఏమి చెప్పారు?
నీవు పేదవాడివి కాదు, ఔదార్యాన్ని ప్రదర్శించని వాడివి, దానం చేసే ధర్మాన్ని అవలంబించని వాడివి అని బుద్ధుడు చెప్పారని ప్రచారంలో ఉంది. అందుకే అతనిలో వెలితి ఉందని అన్నారు.
బుద్ధుడు చెప్పిన ఐదు నిధులు ఏమిటి?
ప్రతి మనిషి వద్ద ఉన్న ఐదు సంపదలు: ముఖం, కళ్ళు, నోరు, హృదయం, శరీరం. వీటిని గుర్తించి ఉపయోగిస్తే ఎవరైనా ఇతరులకు దానం చేయగలరు.
నోటితో, కళ్ళతో దానం ఎలా చేయాలి?
ప్రేమతో, శ్రద్ధతో, మానవత్వంతో ఇతరులను చూడటం కళ్ళతో చేసే దానం. మంచి మాటలు, ప్రేరణాత్మక మాటలు, ఓదార్పు మాటలు చెప్పడం నోటితో చేసే దానం.
శరీరంతో ఎలాంటి సేవ చేయవచ్చు?
చేతులు, కాళ్లు, శక్తిని ఉపయోగించి వృద్ధులకు సహాయం చేయవచ్చు, పిల్లల్ని గమ్యానికి చేర్చవచ్చు, మొక్కలు నాటవచ్చు. ప్రతి చిన్న సహాయం ఓ మహాసేవ.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సంస్కృతి నుంచి మరిన్ని
- కుటుంబ వ్యవస్థ ఎందుకు బలహీనపడుతోంది? 15 కారణాలు – మనం ఏం చేయాలి
- గోదావరి పిలిచింది: సర్ ఆర్థర్ కాటన్, ధవళేశ్వరం ఆనకట్ట మరియు ఇంటికి తిరిగి రావడం గురించి ఒక తెలుగు కథ
- ప్రపంచవ్యాప్తంగా హిందువులు బహిరంగ ప్రదేశాల్లో సురక్షితంగా ఉండాలి: ఆలయ భద్రత, పండుగల భద్రత మరియు రోజువారీ జీవితం
- చనిపోయిన కోతులు మనకు ఎందుకు కనిపించవు: నమ్మకం మరియు సహజ వివరణ
- తెలుగు ఉచ్చారణ, వ్యాకరణం & పెద్ద బాల శిక్ష ప్రాముఖ్యత – మాతృభాషను కాపాడుకుందాం



