తెలుగు ఉచ్చారణ, వ్యాకరణం & పెద్ద బాల శిక్ష ప్రాముఖ్యత – మాతృభాషను కాపాడుకుందాం
📝 శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.
📝 శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ........
నాగరిక ప్రపంచం కళ్ళని - కల్లు అనీ, శిరీష - షిరీష అనీ, వేళ - వేల అనీ, కళ - కల అనీ, పళ్ళు - పల్లు అనీ, కాళ్ళు - కాల్లు అనీ, ఇలాగే ఇంకా ఎన్నెన్నో..... అపస్వర శబ్దాలు... వినలేని అపస్వరాలు.. ముఖ్యంగా టీవీల వల్ల..
🌍 విదేశాలలో తెలుగు
విదేశాలలో ఉన్న తెలుగు వారు, చక్కటి భాషా ప్రావీణ్యతతో రాణిస్తున్నారు..
🗣️ మాతృభాషకు విలువ
కొంతమంది తెలుగువారే.. సగం తెలుగు - సగం ఆంగ్లము మాట్లాడడంలో మాతృభాషకు ఇచ్చే విలువలు వారికే తెలియాలి.
📚 వ్యాకరణం – ఉచ్చారణ
అలాగే వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసు కోలేరు. ఉచ్చారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.
అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే, వాక్ శుద్ధి వస్తుంది.... మన నాలుక శుభ్ర పడుతుంది. ఆ వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.
🙏 శ్రీ హనుమ
అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ, శ్రీ సూర్య నారాయణుని సన్నిధిలో సకల విద్యలు నేర్చుకొని, నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి వివాహముచేసుకొని...
(వివాహితుడే అర్హుడు కనుక), నవ వ్యాకరణ పండితుడై, భవిష్యత్ బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు....
📖 పెద్ద బాల శిక్ష
తెలుగు వారికి పురాణ గ్రంథమైన పెద్ద బాల శిక్ష... దొరకటం మహా పుణ్య ఫలం....
ఆ మహాగ్రంధం చదివి పెద్దలు, పిల్లలూ మహా జ్ఞానులవుతారు..
అందులో వ్యాకరణ సంపద అపారంగా లభిస్తుంది..
తప్పక చదవండి.
భావితరాలకు మన జ్ఞాన సంపదను తరలించండి....




