02-08-2025 / శనివారం / రాశి ఫలితాలు

మేషంఆర్థికంగా అనుకూలత ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
మేషం
ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
వృషభం
స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంట్లో, బయట కొంత వ్యతిరేక వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి.
మిధునం
ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధువులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం కలత కలిగిస్తుంది. ఇంటి, ఉద్యోగ విషయాల్లో నిరాశావహ పరిస్థితులు ఎదురవుతాయి.
కర్కాటకం
కుటుంబ సమస్యలు బాధిస్తాయి. పని ఒత్తిడితో శరీరానికి విసుగ్గా ఉంటుంది. ఆర్థికంగా నిరాశ కలుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగంలో కొంత సహకార వాతావరణం ఉంటుంది.
సింహం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహక వార్తలు లభిస్తాయి.
కన్యా
ఆకస్మిక ప్రయాణ అవసరం ఏర్పడుతుంది. సన్నిహితుల వల్ల ఆర్థిక ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబంతో ఆలయ సందర్శనలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
తులా
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్య విషయాల్లో సన్నిహితులతో చర్చలు జరుగుతాయి. నూతన వాహన కొనుగోలు సూచనలున్నవి. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగవాతావరణం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపార, ఉద్యోగాలు చికాకులతో సాగుతాయి.
ధనుస్సు
దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కుటుంబ సమస్యలు కొంత కలత కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
మకరం
సామాజిక గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తాయి. ఉద్యోగాలలో సానుకూలత పెరుగుతుంది.
కుంభం
ఆర్థిక విషయంలో నిరాశ కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కలత కలిగిస్తాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి.
మీనం
ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కలత కలిగిస్తుంది. సన్నిహితుల ప్రవర్తన అసహనం కలిగిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి.




