రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ గారు అగ్రేసరుడు. చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర, ముద్రా రాక్షసం, అనర్ఘరాఘవం, కాదంబరి వాటిని చదివాడు.
తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ గారు అగ్రేసరుడు.
విమర్శనారీతులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను - కొన్ని వందల కృతులను - ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమస్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు.వీరి తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు. జన్మస్థలం: అనంతపురం జిల్లా, కంబదూరు మండలం రాళ్లపల్లె గ్రామం. తండ్రి వద్దనే సంస్కృతాంధ్ర భాషలలోప్రావీణ్యతసంపాదించి, మైసూరు పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నాడు.
చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర, ముద్రా రాక్షసం, అనర్ఘరాఘవం, కాదంబరి వాటిని చదివాడు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిన సీతమ్మ, రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కట్టమంచి రామలింగారెడ్డి గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలు మరియు ఉపన్యాసాలు మొదలు పెట్టాడు. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించాడు. పెద్దన పెద్దతనము అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.
శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం, శివం, సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం.
రేడియోకు "ఆకాశవాణి" అన్నపేరు పెట్టింది శర్మగారే. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.
సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయ సంగీతాన్ని అభ్యసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. రేడియో కు ఆకాశవాణియని పేరు పెట్టినది ఆయనే.
రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ - కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. ఈ పాటను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ సమంజసము.
మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో గాన కళాసింధు బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం సంగీత కళారత్న బిరుదుతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్. పట్టంతో గౌరవించింది..
1928 నవంబరు చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయకమైనవి. ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు "ఇరు ప్రక్క లందును మరుగులేని మంచి పదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెరుగిచ్చినట్టి, సంకేత దూషితముగాని, ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత"… ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవుడుపయోగించిన మూల ద్రవ్యములు” అన్నారు. వేమన ద్వారా రాళ్ళపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాటవేశారు. రాళ్ళపల్లివారి సారస్వతోపన్యాసాలు, వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్ళపల్లి గొప్ప పేరు గాంచారు.
"……త్యాగరాజు వంటివారి కీర్తినలలో భక్తి యెంతయున్నను వారి గానపాండిత్యము దానిని గప్పి పెట్టినది.పల్లవిదాటులను జూపుద మనిపించునే కాని, వానిని పాడునపుడు ప్రాయికముగ భక్తిని ప్రకటింత మనిపించును."
"……వేమన పద్యము లట్టివి కావు. అతనివి చిటుకలో ముగింపగల చిన్న పలుకులు; అచ్చ తెనుగు పద్యపునడక; గుండు దెబ్బవలె గుఱి తప్పని చిక్కని చెక్కినమాటలు. నోరుగల తెలుగువారందఱును నేర్వవచ్చును."
"బాలవ్యాకరణము, అప్ప కవీయము మొదలగువాని దెబ్బలకు వేమన పద్యము లెంత నులినులి యైనవో చెప్పితీఱదు." " మనలో నయముతోడి హాస్యము లేదని మొదలే విన్నవించితిని. నవరసములలో హాస్యమును గూడ జేర్చియున్నను ప్రాచీనుల హాస్యము అసహ్యములను అనభ్యములను వర్ణించుట యందు మాత్రము చరితార్థ మయినది."
" నిజముగా తెనుగు భాషకు మొట్టమొదట హాస్యరసము చవిచూచిన ధీరుడు గురుజాడ అప్పారావుగారే. వారి కన్యాశుల్కమునందున్నంత హాస్యరసనైర్మల్యము తక్కిన యెవరి గ్రంథములందును లేదనుట యతిశయోక్తి కాదు."
తెలుగువంటి బ్రతికియుండు భాషలలో 'ఇవేయపశబ్దములు, ఇవేసుశబ్దములు' అని నికరముగా శాశ్వతముగా నిర్ణయించుటకు బూనుకొనుట వట్టి వెఱ్ఱియని యిన్నాళ్ళకును తెలిసికొనలేకపోవుట మనతప్పు గదా!"
ఇవియెల్ల అనంతకృష్ణశర్మగారి హృదయమునుండి చిందిలిన సందేశ సుధాబిందువులు..
ఇంత తియ్యనైన తెనుగు శయ్య ప్రాకృత పుణ్యవాసన కలిమి అనంత కృష్ణశర్మ గారి కందినది. ప్రమాణమునందు పయి పద్యములు పొట్టి వైనను, గుణమునందు గట్టివి. కట్టమంచికవి శర్మగారి సప్తశతీసారమునకు బ్రస్తావన సేయుచు నిటులనెను: "...ఈగాథసప్తశతి బౌద్ధయుగమునాటి యుత్కృష్ట జీవితమును దెలుపుచున్నది. భావములు కోమలములు. వానికి దీటైనది అనంతకృష్ణ శర్మగారి శైలి - మధురము, లలితము, రమణీయము.
ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు.
శర్మగారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 18-10-1970న "ఫెలోషిప్" నిచ్చి సత్కరించింది.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం 30-4-1974 గౌరవ "డి.లిట్" పట్టాతో గౌరవించింది.
మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో 'గాన కళాసింధు' బిరుదుతో సత్కరించారు.
బెంగుళూరు గాయక సమాజం ' సంగీత కళారత్న' బిరుదుతో సత్కరించింది.
సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న తి.తి.దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. వయోభారంతో వారు తిరుపతికి వెళ్ళలేక పోయారు కార్యనిర్వాహణాధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్‌గారు బెంగుళూరు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు శర్మగారికి బిరుదు ప్రదానంచేసి సత్కరించారు. కాని ఆ రోజు రాత్రి 7-05 గంటలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్ళపల్లివారు స్వర్గస్థులైనారు..
🙏🙏🙏🙏🙏
Pc Google




