వైకుంఠ చతుర్దశి పాషాణ చతుర్దశి

కార్తీక శుద్ధ చతుర్దశి “వైకుంఠ చతుర్దశి” గా లేక “పాషాణ చతుర్దశి” గా పిలువబడే ఈ పవిత్ర దినం నేడు – నవంబర్ 4, 2025 (మంగళవారం) సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజు పరమశివుని పూజిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనది.
కార్తీక శుద్ధ చతుర్దశి “వైకుంఠ చతుర్దశి” గా లేక “పాషాణ చతుర్దశి” గా పిలువబడే ఈ పవిత్ర దినం నేడు – నవంబర్ 4, 2025 (మంగళవారం)
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజు పరమశివుని పూజిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనది.
కర్తవ్యపాలనలో శివకేశవులు వేరుగా కనిపించినా… వాస్తవానికి వారిద్దరూ ఒక్కటే! వేదకాలం నుంచే ఇది చెప్పబడింది.
వైకుంఠ చతుర్దశి ఐతిహ్యం దేవర్షి నారదుడు శ్రీమన్నారాయణుని ప్రశ్నించగా… “స్వామీ! సామాన్య భక్తులకు నీ వైకుంఠం ఎలా లభిస్తుంది?”
సమాధానం: “నారదా! కార్తీక చతుర్దశి రోజు నన్ను వైకుంఠ నారాయణునిగా ఆరాధించే ఆస్తికుడు తప్పకుండా వైకుంఠాన్ని చేరుకుంటాడు!”
స్వయంగా శ్రీహరి ఆజ్ఞాపించాడు: “జయా! విజయా! ఈ రోజు స్వర్గ ద్వారాలు తెరవండి!”
అందుకే ఈ రోజు శ్రీహరి పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి ఖాయం!
మరో ఐతిహ్యం మహావిష్ణువు కాశీ వెళ్లి పరమశివుని పూజించాడు. అందుకే ఈ రోజు కాశీ విశ్వనాథ ఆలయం వైకుంఠంగా పరిగణించబడుతుంది.
హరి-హరులకు భేదం లేదు – ఇదే సందేశం!
కార్తీక మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదం కానీ ఏ తిథిన ఏం చేయాలో కొద్దిమందికే తెలుసు.
ఈ రోజు ఏం చేయాలి?
- ప్రాతఃకాల స్నానం (అరుణోదయంలో)
- శివ పూజ – బ్రహ్మ ముహూర్తంలో
- విష్ణు పూజ – నిశీథ కాలంలో (రాత్రి 11:39 PM – 12:31 AM)
- మణికర్ణిక స్నానం (కాశీలో) లేదా ఇంట్లో గంగాజల స్నానం
- దీప దానం, కార్తిక పురాణ పారాయణం
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు
శ్రీ సద్గురు పీఠం
ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి – మీ భక్తి ఇతరులకు కూడా చేరాలి!
తరచుగా అడిగే ప్రశ్నలు
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు వస్తుంది?
కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి లేదా పాషాణ చతుర్దశి అంటారు. 2025లో ఈ పర్వదినం నవంబర్ 4, 2025 (మంగళవారం) నాడు వచ్చింది.
వైకుంఠ చతుర్దశి ఎందుకు విశిష్టమైనది?
పురాణాల ప్రకారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజు పరమశివుని పూజిస్తాడు. ప్రచారంలో ఉన్నట్లుగా, మహావిష్ణువు కాశీ వెళ్లి శివుని పూజించినందున ఈ రోజు కాశీ విశ్వనాథ ఆలయం వైకుంఠంగా పరిగణించబడుతుంది.
వైకుంఠ చతుర్దశి నాడు ఏమి చేయాలి?
అరుణోదయంలో ప్రాతఃకాల స్నానం, బ్రహ్మ ముహూర్తంలో శివ పూజ, నిశీథ కాలంలో విష్ణు పూజ చేయాలి. కాశీలో మణికర్ణిక స్నానం లేదా ఇంట్లో గంగాజల స్నానం, దీప దానం, కార్తిక పురాణ పారాయణం చేయాలి.
వైకుంఠ చతుర్దశి 2025 నిశీథ కాల విష్ణు పూజ సమయం ఏది?
నవంబర్ 4, 2025 వైకుంఠ చతుర్దశి నాడు విష్ణు పూజకు నిశీథ కాలం రాత్రి 11:39 PM నుండి 12:31 AM వరకు ఉంది.
వైకుంఠ చతుర్దశి ఐతిహ్యం ఏమిటి?
ప్రచారంలో ఉన్నట్లుగా, సామాన్య భక్తులకు వైకుంఠం ఎలా లభిస్తుందని నారదుడు అడగగా, కార్తీక చతుర్దశి రోజు తనను వైకుంఠ నారాయణునిగా ఆరాధించేవారు వైకుంఠాన్ని చేరుకుంటారని శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఆ రోజు స్వర్గ ద్వారాలు తెరవమని జయ విజయులను ఆజ్ఞాపించాడు.
వైకుంఠ చతుర్దశి నాడు చదివే శివ విష్ణు శ్లోకం ఏది?
"శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః" అనే శ్లోకం హరి-హరులకు భేదం లేదని చాటుతుంది.




