బ్రహ్మ రాత!!

మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతను రాసేస్తాడు కాదా? మరి పూజలు, పునస్కారాలు ఎందుకు చేయాలి? అని కొందరిలో తలెత్తే ప్రశ్న…!!!
అయితే, బ్రహ్మ నుదిటిపై రాత రాసేటప్పుడు ఒక విషయాన్ని కూడా చేర్చాడంట…
“నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. అయితే, మీరు మీ ఉపాసనలతో, మీ అర్చనలతో మార్చుకోగలరు!”
అర్చనలు, ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని బ్రహ్మ సూచించాడట.
ఉదాహరణకు:
ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ల ఆయువు రాశాడనుకోండి. కానీ, ఆ వ్యక్తి చేసే పాపాలవల్ల ఆయువు తగ్గిపోతుంది.
అదే, ఈ తగ్గిన ఆయువును తిరిగి పొందే శక్తి కూడా మనకు కర్మఖాండ ద్వారా కలదు.
పురాణాలను శ్రద్ధగా వినడం ద్వారా ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగించగలదు!
పురాణంలో ఉన్న గొప్ప ఉదాహరణ:
ఒకసారి విభుముఖుడు అనే రాజుకు 50వ ఏట మరణ గండం ఉందని బ్రహ్మ రాశాడు.
ఎవరూ ఈ మరణ గండాన్ని తప్పించలేరని భావించారు. కానీ, అతనికి అదృష్టంగా ఒక గురువు ఆశ్రయం లభించింది.
గురువు చెప్పిన విధంగా మృత్యుంజయ జపం, అర్చనలు చేయడంతో, చావాల్సిన వాడు బ్రతికిపోయాడు!
ఆ తరువాత, జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోతూ,
“ఇతను చనిపోవాల్సిన వాడే, కాని బ్రతికిపోయాడు!” అని తర్కించగా,
వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు:
“ఇతనికి జాతక రీత్యా మరణం తప్పదు. కానీ, గురువు ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేయడంతో, అతను మరణాన్ని జయించగలిగాడు!”
బ్రహ్మ రాసిన రాత మార్చలేడు, కానీ…
పురాణాలను శ్రద్ధగా వినడం, మంత్రాలు చదవడం, ప్రదక్షణలు చేయడం వంటివి బ్రహ్మ రాతను మార్చగలవు!
ఆపద వచ్చినప్పుడు భయపడకుండా దేవి పాదాలను స్మరించాలి!
అమ్మ పాదాలను భక్తి భావంతో ఆరాధించడం వలన బ్రహ్మ వంటి దేవతలు కూడా మనకు సేవకులవుతారు.
ధర్మం ఎలా బ్రహ్మ రాతను మార్చగలదు?
దుర్యోధనుడు 128 ఏళ్ల ఆయువుతో పుట్టాడు.
కాని, ద్రౌపదిని జుట్టు పట్టించి అవమానించిన పాపం వలన 60 వ ఏటనే మరణించాడు!
కాబట్టి, బ్రహ్మ రాసినప్పటికీ, పాపం చేసినవారు నశిస్తారు!
అదే పుణ్యం వలన బ్రహ్మ రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవారు కూడా ఉన్నారు.
కర్మను మార్చే మార్గం:
ఏ కష్టం వచ్చినా “బ్రహ్మ నాకు ఇలా రాశాడు” అని కృంగిపోకండి!
ఆ రాతను మార్చుకోవడానికి:
✅ పూజలు చేయండి
✅ దానాలు, ధర్మాలు ఆచరించండి
✅ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి
✅ సమాజసేవలో నిస్వార్థంగా పాల్గొనండి
✅ పేదలకు సహాయం చేయండి
ఈ మార్గాల్లో నడిస్తే, బ్రహ్మ రాసిన రాత కూడా మారుతుంది!
🔱 శ్రీ సద్గురు పీఠం శుభమస్తు 🙏
🌍 సమస్త లోకాః సుఖినోభవంతు!