ఈరోజు (14/12/24) శనివారం పౌర్ణమి ఘడియలు రాత్రికి ఉన్న సందర్భంగా ఈ రాత్రికి వెన్నెల పారాయణం చేయండి

ఈ రాత్రికి ఇలా చేయండి కాచిన పాలల్లో ఏలకులు , పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తిరిపోతుంది 👉 పౌర్ణమి చాలా చాలా విశేషం , ఇలా భక్తిశ్రద్ధలతో , పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
ఈ రాత్రికి ఇలా చేయండి
కాచిన పాలల్లో ఏలకులు , పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తిరిపోతుంది
👉 పౌర్ణమి చాలా చాలా విశేషం , ఇలా భక్తిశ్రద్ధలతో , పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
మీకు ఎట్టి సమస్య అయినా పరిస్కారం తప్పకుండా లభిస్తుంది , ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి.
లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది , అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీ చక్రం చుట్టి ఉంటుంది .
అంత సేపు ఒకే అసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీ చక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవము కలుగుతుంది , అది అనిర్వచనీయమైన అనుభూతి అనుభవిస్తుంటే అర్ధమవుతుంది , ఒక్కసారి ఊహించండి అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకుని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా. శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది.
ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమి కి చేయవచ్చు
👉 ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్క సారి చదవచ్చు. ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మల సుకృతమే , అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక.
ఏదైనా తీరని సమస్య , లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి.
ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహము కోసం చేయవచ్చు , 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు.
( చంద్రోదయం తరువాత చేయవచ్చు , బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు , వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడుగా భావించి పారాయణ చేయవచ్చు )
అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని…
ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది ఆ జగన్మాత!
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తరచుగా అడిగే ప్రశ్నలు
పౌర్ణమి వెన్నెల పారాయణం ఎలా చేయాలి?
కాచిన పాలల్లో ఏలకులు, పటికబెల్లం కలిపి వెన్నెలలో కూర్చుని, చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. పారాయణం తర్వాత ఆ పాలను ఇంట్లో వారు తాగాలి.
వెన్నెల పారాయణం ఏ సమయంలో మొదలుపెట్టాలి?
చంద్రోదయం తరువాత పారాయణం చేయవచ్చు. ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమికి చేయవచ్చు.
9 సార్లు లలితా సహస్రనామం చదవలేకపోతే ఏం చేయాలి?
ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్కసారి చదవచ్చు. శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి చేసినా అమ్మవారి అనుగ్రహం కోసం చేసినట్లే అని భక్తుల విశ్వాసం.
బయట కూర్చోలేని వారు లేదా వర్షంలో చంద్రుడు కనిపించనప్పుడు ఎలా చేయాలి?
బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలను దేవుడి ముందు పెట్టుకుని పారాయణం చేయవచ్చు. వర్షాల వల్ల చంద్రుడు కనిపించకపోతే అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడుగా భావించి పారాయణం చేయవచ్చు.
లలితా సహస్రనామం చదివితే శ్రీ చక్రం గురించి ఏమని చెబుతారు?
ప్రచారంలో ఉన్నట్లుగా, లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది. 9 సార్లు పూర్తయ్యే వరకు ఒకే ఆసనంలో భక్తిగా చదివితే బీజాల ప్రకంపనలు స్పర్శిస్తున్న అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతారు.
వెన్నెల పారాయణం ఎవరు, ఏ ఉద్దేశంతో చేయవచ్చు?
తీవ్రమైన సమస్య ఉన్నవారు గానీ, ఏ సమస్య లేకపోయినా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం గానీ ఎవరైనా చేయవచ్చు. భక్తిశ్రద్ధలతో చేసిన ఎందరో భక్తులు కోరికలు తీరిన అనుభవాలు పంచుకుంటారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
హిందూమతం నుంచి మరిన్ని
- హిందూ ధర్మంలో గురువారం ఆచారాలు — గురువార విష్ణు పూజ, గురు ఆరాధన & 2026 సంపూర్ణ NRI మార్గదర్శి
- పిల్లలకు హిందూ ధర్మాన్ని ఎలా నేర్పించాలి: కథలు, పండుగలు, మంత్రాలు మరియు కుటుంబ సంప్రదాయాలు
- భగవద్గీత శ్లోకాలు అర్థంతో: జ్ఞానం, సందర్భం మరియు దైనందిన జీవితంపై 15 ముఖ్య శ్లోకాలు
- 2026లో AI మరియు సంస్కృత పునరుజ్జీవనం: లాంగ్వేజ్ మోడల్స్, తాళపత్ర గ్రంథాల OCR, అనువాద సాధనాలు, AI ఇంకా ఎక్కడ తప్పు చేస్తోంది
- రోబో పూజ చేయగలదా? రోబో హారతి, ఆచారాల్లో AI మరియు హిందూ సంప్రదాయం ఏమంటుంది




