కడప అంటే ఒక ప్రాచీన చరిత్ర
కడప అంటే ఒక మహా పవిత్రత
మర్యాదలకే మర్యాదలు నేర్పే
గొప్ప సంస్కారం కడప సొంతం

నిన్నా మొన్నటిది కాదు
ఘన చరితల కడప చరిత్ర
అది మౌర్యులతోనే ఆరంభమైంది .

Advertisement

ఎర్రగుడి శాసనం , రాజుల మందగిరి శాసనాల ద్వారా ఈ జిల్లా క్రీ.పూ.224-236 మధ్య కాలంలో అశోకుని పాలన ఉండేదని తెలుస్తుంది.

శాతవాహనుల కాలంలో ములికినాడు’గా నాసిక్‌ శాసనం ద్వారా తెలుస్తోంది. ఇక్ష్వాకుల కాలంలో ఇది హిరణ్యరాష్ట్రం’గా పిలువబడేదని చరిత్ర చెబుతోంది.

Advertisement

పల్లవులు, బాదామి, చాళుక్యులు, రేనాటిచోరులు, బాణులు, వైదుంబులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, మట్లిరాజులు, కుతుబ్‌షాయులు, హైదరాలీ, టిప్పుసుల్తాన్‌, అసఫ్‌జాహీ, మొగలులు, ఆంగ్లేయులు పరిపాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి.

చరిత్ర పూర్వయుగం నుంచే
కడప జిల్లాలో నాగరికత వికాసం ఆరంభమైంది.

భారతదేశ గొప్ప చక్రవర్తుల్లో ఒకరైన అశోకుడు కడపను పరిపాలించారు. అశోకుని క్రీ.పూ.226-236 శాసనాల ద్వారా ఈయన పాలన సాగినట్లు తెలుస్తోంది.

Advertisement

గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర రాజులు మూలకరాజుగా వర్ణించారు. జిల్లా ములికినాడులో ఉండేది. జమ్మలమడుగు తాలూకా పెద్దముడియంలో ఆనాటి సీసపు నాణేలు లభించాయి. రాజంపేట సమీపంలోని అత్తిరాలలో ఓ మహిళకు రోమన్‌ నాణేం దొరికింది. ఈ ఆధారాల ద్వారా జిల్లాలో శాతవాహనుల పాలన చేసినట్లు వెల్లడవుతోంది.

పల్లవ-చాళుక్య యుద్ధాలు ఎక్కువగా సాగాయి. క్రీ.శ. 275లో శాతవాహనుల సామంతరాజులు ఇక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. జిల్లాలో కొన్ని భాగాలున్న హిరణ్య రాష్ట్రంలోని హిరణ్యకులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు.

హిరణ్య రాష్ట్రంలో భాగంగా కడపజిల్లా ఇక్ష్వాక రాజు పురుషదత్తుని శాసనంలో మహాతలవర మహాసేనాపతి వశిష్ఠపుత్ర చలికి రెమ్మన పేరు కన్పిస్తుంది. ఇతను కడప రాజుగా ప్రతీతి.

కాంచీపుర రాజులైన పల్లవులు కృష్ణాతీరం నుంచి జిల్లాను ఆక్రమించారు. అయిదో శతాబ్ధంలో త్రిలోచన పల్లవుడు రాజంపేట తాలూకాలో పలు గ్రామాలను నిర్మించారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.

Advertisement

చాళుక్య, పల్లవ యుద్ధాలు సింహాభాగం కడపలో జరిగాయి. పల్లవ రాజు విజయాదిత్యుడు చాళుక్యుల చేతిలో మరణించగా రాణి పెద్దముడియంలో బందీ అయింది.

బాదామి చాళుక్యుల జన్మస్థం కడపజిల్లా అని ఎక్కువ మంది చరిత్రకారుల నమ్మకం. కరికాల చోళుని వారసులు రేనాటి చోళులు కడప ప్రాంతాన్ని పాలించారు. వీరి కాలంలో తెలుగు భాష సాహిత్యపరమైన ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిలో గుణ ముదిత, పుణ్యకుమారుడు గొప్పవారు.

ఎర్రగుడి, దొమ్మరనంద్యాలలో రేనాటి చోళుల శాసనాలు లభ్యమయ్యాయి. దానవులపాడులోని జైనులు నిర్వహించిన సల్లేఖన వ్రతం గురించి వివరించారు.

చాళ్యుల వంశకర్త ముదివేములో జన్మించారు. ఆ ప్రాంతమే నేటి పెద్దముడియం. వీరి శాసనాలు క్రీ.శ. 696-733 దానవులపాడులో బయటపడ్డాయి.

Advertisement

జైనులు అతి పవిత్రంగా భావించే సల్లేఖన వ్రతం జిల్లాలోని దానవులపాడులో నిర్వహించారు. కడప ప్రాంతం క్రీ.శ. 894-972లో వీరి ఏలుబడిలో ఉంది. వీరి రాజధాని పవిపురి’కాగా బాణవుడిగా వ్యవహరించేవారు. జమ్మలమడుగులోని పొట్టిపాడులో వీరి శాసనాలు ఉన్నాయి.

కడప తిరిగి క్రీ.శ.982లో చోళుల పాలనలోకి వచ్చింది. మొదటి రామరాజు కాలంలో కడప ప్రాంతం ఇనగల్లూరునాడుగాపిలిచేవారు.

కాకతీయుల రాణి రుద్రమదేవి శాసనం అట్లూరులో లభించింది. గణపతిదేవుడు (1199-1261) కాలంలో జిల్లా కాకతీయుల పాలనలో ఉండేది. రుద్రమదేవికి చెందిన 1268 శాసనం అట్లూరులో దొరికింది.

ప్రతాప రుద్రుడు (క్రీ.శ.1295-1323) శాసనాలు ఉప్పరపల్లి, ప్రొద్దుటూరు, టంగుటూరు, చెండువాయిలో ఉండేవి. రాయచోటి మినహా వీరి అధీనంలో ఉండేది.

క్రీ.శ.1336లో హరిహరదేవరాయులు, బుక్కరాయులు జిల్లాను ఆక్రమించారు. కాలువలు, చెరువులను తవ్వించారు. భాస్కరభవదూరుడు క్రీ.శ.1369లో పోరుమామిళ్ళ ఆనంతసాగర చెరువును నిర్మించారు.

కృష్ణదేవరాయుల కాలంలో గండికోట సీమలోని కోగటంను అలసాని పెద్దనకు దానం ఇచ్చారు.

మట్లిరాజులు 13వ శతాబ్ధంలో పరిపాలించారు. అనంతరాజు పొత్తపి వద్ద చిన్నమ్మ కాలువను తవ్వించారు. కుమార అనంతరాజు కుముద్వళి కళ్యాణ గ్రంధకర్త. వీరు విజయనగర రాజుల సంప్రదాయాలనుఆచరించారు.

మొఘలుల పాలన కాలంలో కడప మజిలీ కేంద్రంగా ఉండేది. సైనికులకు తిండి, సరుకులు, నూనె కేంద్రంగా ఉండిపోయింది. క్రీశ. 1688లో ఔరంగజేబు హైదరాబాదు, కర్ణాటక పాలనలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు.

ఔరంగజేబు మరణానంతరం కడపకు వచ్చిన పఠాన్‌ దళాధిపతి అబ్దుల్‌ నవీఖాన్‌, మయా నవాబుల్లో మొదటివాడు. క్రీ.శ. 1717 సిద్దవటం కోటను వశం చేసుకున్నాడు. గండికోట ఆక్రమించుకున్నారు. హలీంఖాన్‌లో 1779 హైదర్‌వలీ ఓడించారు.

హైదర్‌-టిప్పుల కాలంలో ఈ ప్రాంతాలలో మరాఠాలకు హైదర్‌ సైన్యాలకు-నవాబులకు యుద్ధాలు జరిగాయి. క్రీ.శ. 1792లో సంది మేరకు టిప్పు ఈ ప్రాంతాన్ని కోల్పోయారు. పాలెగాళ్లు విజృంభించారు. క్రీ.శ. 1800లో జిల్లా బ్రిటీష్‌ పాలనలోకి వచ్చింది.

ఇది ….. ఇదీ కడప చరిత్ర అంటే ……