కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నాకర్థమైపోయింది !

అక్కడ ఉన్నట్టుండి
పాకే పాకే పసిబిడ్డ
నెత్తురు ముద్దై పోతుంది

Advertisement

సామగానం చేసే
కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి
వేదం ఆగి – రుధిరం బైటికొస్తుంది

అక్కడ రేపు పల్లకీ లెక్కి
ఊరేగాల్సిన పెళ్లికొడుకులు
ఇవాళే పాడెక్కుతారు...

Advertisement

ఆ లోయలో
హిమాలయాలు సైతం
మూర్తీభవించిన
వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం
వొరుసుకునీ
నిరంతరం అక్కడ
నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా
కళ్లూ నోరూ మూసుకుని
మళ్లీ అంతర్ముఖుడౌతాడు !!