శిశిర ఋతువులో రెండవ మాసమైన ఫాల్గుణ మాసంలో చేసే దైవకార్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. విష్ణుసహస్ర నామములలో "శిశిరః శర్వరీ కరః" - నారాయణునికి ఒక నామముగా ఈ ఋతువు చెప్పబడడంలోనే దీని విశేషం తెలుస్తోంది. నారాయణుడు ఈ మాసములో "గోవింద" నామముతో నియామకుడు. నామత్రయ మంత్రంగా చెప్పబడుతున్న అచ్యుత, అనంత, గోవిందనామాలలో కూడా ప్రధానమైనది గోవిందనామం. భాగవతములో కూడా ఈ మాసము విష్ణుప్రీతికరమని చెప్పబడింది. ఫల్గుణీ నక్షత్రము దేవతాకము. పూర్వ ఫల్గుణీ నక్షత్రమునకు సూర్యుడు “అర్యముడు" అనే నామముతో దేవతగా ఉంటాడు. అర్యముడు అధిక తేజస్సు కలవాడు. శాస్త్రముల ప్రకారము దేవతలందరూ ఈ అర్యముని అనుసరించి ఉంటారు..

ఫాల్గుణమాసంలో శివార్చనకై శివరహస్యాంతర్గత శివాష్టోత్తర శతనామములు -

Advertisement

నమః శివాయ శాంతాయ సహమానాయ శంభవే!
స్తవమేతత్ ప్రయుఞ్జీత శర్వప్రీతికరం మమ!!

భవాయ శివరూపాయ శతావర్తాయ వేధసే!
దుందుభ్యాయ వరేణ్యాయ శరణ్యాయ పినాకినే!!

Advertisement

యోగినే ధ్యానగమ్యాయ రమ్యాయ గురవే నమః!
అవసాన్యాయ వన్యాయ ఆహనన్యాయ తే నమః!!

కామనాశాయ వాసాయ హరణాయ విసారిణే!
నమోస్తు తే మహేశాయ నమః శాంతతమాపతే!!

ప్రధానపురుషేశాయ యోగాధిపతయే నమః!
నమస్త్రికాగ్నికాలాయ త్ర్యంబకాయ పినాకినే!!

Advertisement

నమః కాలాయ రుద్రాయ మహాసత్రాయ శూలినే!
నమో ధూర్జటయే తుభ్యం జటిలాయ కృశాయ చ!!

బ్రహ్మాధిపతయే తుభ్యం బ్రహ్మవిద్యాధిపాయ చ!
విష్ణోశ్చ జనకాయాథ కామమాయాంతకాయ చ!!

నమో వేదరహస్యాయ హర్షతర్షాయ తే నమః!
వేదవేదాంత సారాయ సుపారాయ నమోనమః!!

అతీతానాగతజ్ఞాయ వర్తమానాయ బృంహతే!
మేరుకోదండహస్తాయ గంగామస్తాయ దారిణే!!

Advertisement

నమో బుద్దాయ శుద్ధాయ మేధ్యాయ పరమాత్మనే!
భూతనాథాయ భవ్యాయ హవ్యకవ్యభుజే నమః!!

నమో దిగ్వాససే తుభ్యం దండినే ముండినే నమః!
అనాదిమలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః!!

ప్రధానపరమాణ్వాదిమూర్తయే అనంతశక్తయే!
విచిత్రమహిమాధారస్వరూపాయ నమోనమః!!

భూమ్నే సీమ్నే వేదధామ్నే వ్యోమసామ్నే నమోనమః!
నమస్తారాయ తీర్థాయ సర్గాదిపరమాయ చ!!

నమః పార్యాయ వార్యాయ శర్వాయ ప్రతిమాయ చ!
కుక్కురాయ విశేషాయ మధ్యాంతరహితాయ చ!!

ప్రసన్నాయ పరాయాయ కామాంగాయ సురేతసే!
గర్జత్తే తర్జతే చైవ మార్జతే బ్రహ్మరూపిణే!!

ఊర్జాయ కాలనేత్రాయ దుర్గగమ్యాయ భాస్వతే!
తామ్రాయ తరుణాయాథ కారణాయ నమోనమః!!

నమో ధర్మాదిగమ్యాయ విరాగాయ సురాగిణే!
నమస్తే నిష్ప్రపంచాయ నిరాభాసాయ తే నమః!!

బ్రహ్మణే విశ్వరూపాయ సనాతన్యాయ మన్యవే!
పత్తీనాం పతయే చైవ కారణానాం చ కారిణే!!

నమః పారదవీర్యాయ దుర్గార్తి శమనాయ చ!
దేవ్యేభిర్నామభిర్దేవం సంపూజ్య కుసుమైః శుభైః!!

స్తవమేతత్ ప్రయుంజీత శర్వప్రీతికరం మమ!!
మధుకంబలమీశాయ కృత్వా పాపైః ప్రముచ్యతే!!
ఘృతకంబలమానేన వైశాఖే దధికంబళమ్!
కృత్వా పాపైః ప్రముచ్యేత శివస్యతిప్రియోభవేత్!!
మధుకంబళకం కుర్యాత్ ఫాల్గుణే పాపహారి తత్!

  • క్రొత్త కుండ తీసుకొని దానినిండా నెయ్యి పోసి గడ్డ కట్టాక ఆ నెయ్యిని పూజ అంతా అయ్యాక శివలింగం మీద వేసి కంబళి కప్పాలి. దీనిని ఘృత కంబళం అంటారు. అదేపద్ధతిలో మధువు వేస్తే మధుకంబళం అంటారు. ఫాల్గుణమాసంలో మధుకంబళం విశేషం. ఇవి ప్రకృతిలో ఆ కాలంలో వచ్చే వైపరీత్యాలు తొలగిస్తాయి. క్షామములు, క్షోభలు ఇత్యాదులు ఏర్పడినప్పుడు మాసార్చన చేస్తే దానినుంచి బయటపడగలరు.