భారతావని నుదుట సిందూరం

సీ॥సుందర కాశ్మీర శోభలు చెరిపేరు ముష్కర మూకలు పూనెను,మహిళామాతల్లుల మహిత సిందూరమ్ము తుడిచె తలపాకి.
సీ॥
సుందర కాశ్మీర శోభలు చెరిపేరు ముష్కర మూకలు పూనెను,
మహిళామాతల్లుల మహిత సిందూరమ్ము తుడిచె తలపాకి.
మోదీకి చెప్పిన ఘనులందరూ వెళ్ళి, వెనువెంటనె యెంచిరి ప్రతిని;
వదరిన పాకీకి బలమై మదమెత్తి, మోదీ పూనెను ప్రతిజ్ఞ!
తే౹గీ॥
దిక్కులన్నియు మార్మ్రోగ, ధిక్కరించి వెలికి చక్రాయుధమ్ము తీయగా,
గొంతు సవరించి, గర్జించి యుద్ధతంత్రాల నిశ్చయముతో
విశ్వమున్ నివ్వెరపరిచె వీరనాధుడై!
శా॥
మా మోదీకి వచించి వచ్చితిమి సన్మానమ్మున్ జేయన్వెసన్,
మీ మాత్సర్యము తృప్తి పొందునటులన్, మిమ్మెంచి కీర్తించగా –
మోదీ వాక్యమే సైన్యమునకు శక్తి, మాన్యత మింపొందగా!
నేమాచూపులు? కాచుకొండిరా! మిమ్మెంచె మా భారతుల్!
కం॥
మోదీ, షా, జైశంకరు –
ధోబాలుతో కలిసి యాలోచించగా,
పాదులు కదిలించిరి!
పాకీధర నడలంగ చేయ, కృతనిశ్చయులు కదిలిరి!
శా॥
అదిగో! దూకెను భీకర ఉజ్వలముగా నాజిన్ విమానమ్ములు,
రొదలంచుచు, విస్ఫులింగములు విసిరి, నిర్మూలించ పాకిస్థలిన్!
మెదలని శక్యము కాని క్షిపణులు, మిన్నునీడిలో పడ్డట్లె,
కదిలె పాకీ భూభాగమున్ – నగరములు కాష్టాలగడ్డవై పోయె!
ఉ॥
దిక్కులు పిక్కటిల్లె మన తేజము లెక్కలేనిదాడి చేస్తే –
కుక్కలు చింపుదిరి, పాకీ ప్రభుత్వము కూలెను!
పిక్కల శక్తిగా పరిగెత్తెను ప్రజలు, ప్రాణభయంతో!
నక్కెనా? పారెనా? వినాశమే చూచె పాకినేత!
చం॥
త్రివిధదళములు గదలె, తేల్చె పాకినేతల మోసమున్ –
ఛవులు లేక చీల్చె సత్త్వముతో విమాన నౌకలతో!
భవిత హరించి, రేవులను భస్మము జేసె;
జృంభణంతో నవిరళదీక్షతో –
“హా!” అని త్రెంచె నిండుబొజ్జలన్!
ఉ॥
భారత సైన్యములు కదలె భండన విక్రమ పౌరుషంతో!
ధీర విచారతేజులయిన మోదీ, శంకరాది నేతలు –
దీరి వచ్చిరి ముందుకు, దిక్కులు గూడినవల్లే!
భూరి పరాక్రమంతో ప్రమోదమెరగగ, భారతోర్వికిన్!
మ॥
జయహో భారత సైనికా!
ప్రబల విశ్వాసమ్మే నీ కవచము!
నియతిని సాగిస్తూ, మాతృభూమి హితమే ప్రాణంగా ధరించితివి!
శత్రువుని నాశన దీక్షతో నిర్వ్యామోహచిత్తుడవై
నిర్భయంగా మాకై నిలిచిన దేవుడవు నీవు!
గర్వాతీతుడవు! నీవున్నతుడు!
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
~ శ్రీశర్మద
📅 09-05-2025
🕓 ఉదయం: 03:45




