ఈ యుద్ధం స్త్రీలకోసమే. ధర్మయుద్ధం మళ్లీ ప్రారంభమైంది.

ఇది కలియుగం అయినా — నేను మళ్లీ వస్తున్నాను.
దుష్ట శిక్షణకు… శిష్ట రక్షణకు!

Advertisement

ద్వాపర యుగంలో,
నిండు సభలో ద్రౌపదిపై జరిగిన అన్యాయం యుద్ధానికి కారకమైంది.
త్రేతా యుగంలో,
సీతా అపహరణంతో రాక్షస సంహారానికి నాంది పలికింది.
అప్పుడు చేసినట్లు ఇప్పుడు కూడా —
అన్యాయాన్ని నాశనం చేయడానికి నా ఆయుధం మళ్లీ పిలవబడ్డది!

రాజ్యం పోయిన యుద్ధం చేసి తిరిగి సంపాదించుకోవచ్చు.
కానీ ఓ స్త్రీపై జరిగిన అవమానం... అది మర్చిపోవడం అసాధ్యం.
అందుకే యుద్ధం అనివార్యం అయింది. మొత్తం నాశనం జరగాలి. అదే నేను చేసాను.

Advertisement

అప్పట్లో ద్రౌపది ఒక్కతే...
కానీ ఈ కలియుగంలో
26 మంది స్త్రీల కళ్ల ముందే, వారి భర్తలను హతమార్చి, సిందూరాన్ని తుడిచారు.
ఆ ఘాతుకులకు, వారికి మద్దతుగా నిలిచినవారికి శిక్ష విధించాల్సిన సమయం ఆసన్నమైంది.
నా చక్రానికి అడ్డం వచ్చినవారెవ్వరైనా శంహారమే తథ్యం!

స్త్రీలు అబలలు కావు.
స్త్రీలపై అన్యాయం చేసినవారికి తగిన శిక్ష వుంటుంది.
ఆ యుగంలో భార్యను భర్త కళ్ల ముందే అవమానించారు,
ఈ యుగంలో భర్తను భార్య కళ్ల ముందే సంహరించారు.
అందుకే — శత్రువులకు నేను వేసే శిక్ష, సామాన్యమైనది కాదే!

ఈసారి నా వెంట ఉన్నది:
సుదర్శన చక్రం మాత్రమే కాదు,
మహాదేవుని పినాకం కూడా!
ఈ శిక్ష, ఈ సంహారం — ధర్మ స్థాపనకోసం, స్త్రీ రక్షణకోసం.

Advertisement
"యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత…"
"తదాత్మానం సృజామ్యహం!"

వస్తున్నాను… సిందూరాన్ని కాపాడటానికి!
ధర్మం మనవైపు ఉంది.
సనాతన ధర్మం అంటే ఇదే —
"నువ్వు ధర్మాన్ని కాపాడు, ధర్మమే నిన్ను కాపాడుతుంది."

ఈ యుద్ధం…
స్త్రీలపై జరిగిన అన్యాయానికి న్యాయం చేయడానికి.
ఈ యుద్ధం – స్త్రీలకు అంకితం!