పురోహితుడు అంటే ఎవరు?

శ్లోకము:జన్మనా జాయతే శూద్రఃసంస్కారద్విజ ఉచ్యతేవిద్యయా యాతి విప్రత్వంత్రిభిః శ్రోత్రియ ఉచ్యతే పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంతో విప్రుడు, ఈ మూడు ప్రత్యేకతలతో అతడు శ్రోత్రియుడిగా మారతాడు.
శ్లోకము:
జన్మనా జాయతే శూద్రః
సంస్కారద్విజ ఉచ్యతే
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే
పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంతో విప్రుడు, ఈ మూడు ప్రత్యేకతలతో అతడు శ్రోత్రియుడిగా మారతాడు.
పురోహితుడు అనగా:
- ముందుగా హితము పలికెడివాడు
- ధర్మార్థ కామ్‌మోక్షములకు సోపానము
- పూజనీయుడు
- సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
- నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
- ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
- హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
- సాదారణమైన పేరు వశిష్ఠుడు
- మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్
- ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్
- సందేహ నివృత్తికి ఒక నిఘంటువు
- తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక
- భగవంతునికి, భక్తునికి మద్య ఒక వారధి
- భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక
- శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి
- నిత్య కాల గణన చేయు గణిత వేత్త
- గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
- పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి (జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించు వాడు)
- ధర్మ శాస్త్ర ప్రియుడు
పురోహితము:
పు - పురజనులందరికి
రో - రోజురోజుకి
హి - హితముచెప్పుచు
త - తరింపజేసి
ము - ముదముగూర్చునది
పురోహితుడు అనేది కేవలం ఒక శుభకార్యాల పరిపాలకుడిగా మాత్రమే కాకుండా, సమాజం, ధర్మం, పరిసరాలను రక్షించే మరియు ఉన్నత ఆధ్యాత్మికతను ప్రవచించే వ్యక్తిగా కూడా పరిగణించబడతాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు
పురోహితుడు అనే పదానికి అర్థం ఏమిటి?
పురోహితుడు అంటే ముందుగా హితము పలికెడివాడు. పు - పురజనులందరికి, రో - రోజురోజుకి, హి - హితము చెప్పుచు, త - తరింపజేసి, ము - ముదము గూర్చునది అని పురోహితము అనే పదాన్ని వివరిస్తారు.
జన్మనా జాయతే శూద్రః శ్లోకం భావం ఏమిటి?
పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంతో విప్రుడు అవుతాడు. ఈ మూడు ప్రత్యేకతలతో అతడు శ్రోత్రియుడిగా మారతాడని ఈ శ్లోకం చెబుతుంది.
సమాజంలో పురోహితుని పాత్ర ఏమిటి?
పురోహితుడు కేవలం శుభకార్యాలు జరిపించేవాడే కాదు. సమాజం, ధర్మం, పరిసరాలను రక్షించే వ్యక్తిగా, ఉన్నత ఆధ్యాత్మికతను ప్రవచించే వ్యక్తిగా, భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా పరిగణించబడతాడు.
పర్యావరణ పరిరక్షణలో పురోహితుని పాత్ర ఏమిటి?
పురోహితుడు వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి. జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధి వృక్షాలను ప్రతిష్టించి, పెంచి, పోషిస్తాడు. గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించే యజ్ఞమూర్తిగా భావిస్తారు.
పురోహితునికి ఉండవలసిన గుణాలు ఏమిటి?
సహృదయత, మృదుభాషణ, నిత్య కర్మానుష్ఠానం చేసే తపస్సు, ధర్మ శాస్త్రంపై ప్రేమ పురోహితుని గుణాలు. సందేహ నివృత్తికి నిఘంటువుగా, తాను ఉద్ధరింపబడుతూ ఇతరులను ఉద్ధరించే జ్ఞాన దీపికగా ఉంటాడు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
హిందూమతం నుంచి మరిన్ని
- హిందూ ధర్మంలో గురువారం ఆచారాలు — గురువార విష్ణు పూజ, గురు ఆరాధన & 2026 సంపూర్ణ NRI మార్గదర్శి
- పిల్లలకు హిందూ ధర్మాన్ని ఎలా నేర్పించాలి: కథలు, పండుగలు, మంత్రాలు మరియు కుటుంబ సంప్రదాయాలు
- భగవద్గీత శ్లోకాలు అర్థంతో: జ్ఞానం, సందర్భం మరియు దైనందిన జీవితంపై 15 ముఖ్య శ్లోకాలు
- 2026లో AI మరియు సంస్కృత పునరుజ్జీవనం: లాంగ్వేజ్ మోడల్స్, తాళపత్ర గ్రంథాల OCR, అనువాద సాధనాలు, AI ఇంకా ఎక్కడ తప్పు చేస్తోంది
- రోబో పూజ చేయగలదా? రోబో హారతి, ఆచారాల్లో AI మరియు హిందూ సంప్రదాయం ఏమంటుంది




