ప్ర : శివపంచాక్షర స్తోత్రంలో 'యక్ష స్వరూపాయ' అని శివుని వర్ణించారు. శివుడు యక్షుడిగా ఎప్పుడు ఎలా అవతరించాడు? దాని అంతరార్థమేమిటి?

జ : ఒకప్పుడు దేవతలు రాక్షసుల్ని జయించి, విజయోత్సహాన్ని జరుపుకుంటున్నారు. అంతా తమ నిర్వాకమేనని ప్రగల్భాలను చెబుతున్న సందర్భంలో వారి ముందు పరబ్రహ్మ 'యక్ష' రూపంతో ప్రత్యక్షమయ్యాడు.

తద్దైషాం విజజ్ఞౌ, తేభ్యోహ ప్రాదుర్భభూవ
తన్న వ్యజానంత కిమిదం యక్షమితి॥ (కేనోపనిషత్)

దేవతలు ఆయనను గుర్తించలేక ఈ యక్షుడెవరని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అగ్ని అతన్ని తెలుసుకోవడానికై ముందుకు వచ్చి, 'నువ్వేవర'ని ప్రశ్నించాడు. అప్పుడా యక్షుడు దేవతల ప్రతాపాన్ని తెలుసుకోడానికి వచ్చానని చెప్పి-ఒక తృణాన్ని ఎదురుగా ఉంచి అగ్ని యొక్క ప్రతాపాన్ని చూపించమన్నాడు. అగ్ని తన శక్తినంతటినీ వినియోగించినా, ఆ తృణం దహింపబడలేదు. అలాగే వాయువు కూడా దానిని కదిలించలేకపోయింది. అప్పుడు ఇంద్రుడు వినయంగా ఆ యక్షుని ప్రార్థించగా, అక్కడ జగదంబ బ్రహ్మ విద్యాస్వరూపిణిగా సాక్షాత్కరించి 'తాను ఉమాదేవిననీ, ఆ యక్షుడు పరమాత్మ అనీ, అతని శక్తిని' తానని పరబ్రహ్మ గురించి బోధించింది. అలా యక్షునిగా గోచరించిన శివపరమాత్మ దేవతలకు సైతం దైవత్వాన్నిచ్చిన పరంజ్యోతి. ఇది కేనోపనిషత్తులోను, కొన్ని పురాణాలలోను చెప్పబడిన కథ. ఈ ఇతివృత్తాంతం ఆధారంగా 'యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ' అని శివపంచాక్షరస్తోత్రం వర్ణించింది.'యక్ష' శబ్దానికి 'పూజ్యుడు' అని ఒక అర్థం ఉంది.

('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)

తరచుగా అడిగే ప్రశ్నలు

శివపంచాక్షర స్తోత్రంలో శివుని 'యక్ష స్వరూపాయ' అని ఎందుకు వర్ణించారు?

కేనోపనిషత్తులో ప్రచారంలో ఉన్నట్లుగా, రాక్షసులను జయించి గర్వపడుతున్న దేవతల ముందు పరబ్రహ్మ 'యక్ష' రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ ఇతివృత్తం ఆధారంగానే 'యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ' అని స్తోత్రం శివుని వర్ణించింది.

యక్షుడు అగ్ని, వాయువుల శక్తిని ఎలా పరీక్షించాడు?

యక్షుడు ఒక తృణాన్ని ఎదురుగా ఉంచి ప్రతాపం చూపించమన్నాడు. అగ్ని తన శక్తినంతా వినియోగించినా ఆ తృణం దహింపబడలేదు, వాయువు కూడా దానిని కదిలించలేకపోయింది.

యక్షుడు పరమాత్మ అని ఇంద్రునికి ఎవరు బోధించారు?

ఇంద్రుడు వినయంగా యక్షుని ప్రార్థించగా జగదంబ బ్రహ్మ విద్యాస్వరూపిణిగా సాక్షాత్కరించింది. తాను ఉమాదేవిననీ, ఆ యక్షుడు పరమాత్మ అనీ, అతని శక్తిని తానేనని ఆమె బోధించింది.

'యక్ష' అనే పదానికి అర్థం ఏమిటి?

'యక్ష' శబ్దానికి 'పూజ్యుడు' అని ఒక అర్థం ఉంది. యక్షునిగా గోచరించిన శివపరమాత్మ దేవతలకు సైతం దైవత్వాన్నిచ్చిన పరంజ్యోతి.

శివుడు యక్షుడిగా కనిపించిన కథ ఏ గ్రంథాలలో ఉంది?

ఈ కథ కేనోపనిషత్తులోను, కొన్ని పురాణాలలోను చెప్పబడింది. సామవేదం షణ్ముఖశర్మ గారి ఈ సమాధానం 'ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరించబడింది.