భక్తి అంటే ఏమిటి? నిజమైన భక్తి స్వరూపం

భక్తి అంటే!!...

Advertisement

భక్తి అనేది ఒక బాహ్యచిహ్నము కాదు, కేవలము గుడికి పోయినప్పుడు, పూజ చేసినప్పుడు, వ్రతములు ఆచరించే సమయంలో భక్తి అనే భావమును పెట్టుకొని తరువాత లౌకికములో మునిగితే తప్పు...

పోలీసువాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు మాత్రము వేసుకొని, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తీసే యూనిఫామ్ వంటిది కాదు భక్తి.

Advertisement

ఒక గురువారమో,
సోమవారమో,
శనివారమో,
ఆనాడు మాత్రమే గుడికి వెళ్ళడం కాదు,

భజన సమయంలో మాత్రమే కాదు, సర్వకాల సర్వావస్థలలో భగవన్నామముపై అచంచలమైన శ్రద్ధ, నిశ్ఛలమైన భక్తి

భగవద్ రూపమున ధ్యానము ఉండాలి,
భగవంతునిపై నిరంతరము నిశ్చలమైన, నిర్మలమైన, నిస్వార్థమైన శ్రద్ధ
ధ్యాస ప్రేమ ఉండాలి.

Advertisement

అన్ని కర్మలనూ భగవత్రీత్యర్థంగా చేయాలి.
ఆ సచ్చిదానందస్వరూపుణ్ణి ధ్యానిస్తూ ఉంటే మీరందరూ సచ్చిదానందస్వరూపులుగా మారవచ్చును.

'సత్' అంటే ఎప్పుడూ ఉండేది,
'చిత్' అంటే అన్నీ తెలిసినది,
'ఆనందం' అంటే అందరినీ ప్రేమించి అందరి ప్రేమను పొందేది.

నామజపము, రూపధ్యానము ఈ రెండూ ఉచ్ఛ్వాస నిశ్వాసములవలె అఖండముగా చేస్తూ ఉంటే, మీకు దొరికే ఆనందము వర్ణనాతీతము.

"అది దొరికినప్పుడే మానవ జన్మము సార్థకమయ్యేది."


శుభమస్తు
🙏 శ్రీ సద్గురు పీఠం నుండి....✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏