బ్రాహ్మడిలో బ్రహ్మ కాక వాళ్ళకి బ్రా మాత్రం కనబడితే అది దృష్టిలోపం.

Harathi Srinivasa Dikshit గారి పోస్ట్ :

Advertisement

తాము‌ బాపడికి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే…
అనేది అసలు సమస్య
అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

ఆంధ్రేకస్ థెమిస్టికస్
బ్రాహ్మడు యుమ్ , సమస్య లుమ్:

Advertisement

బాపడు పూజ చేస్తే - సమస్య.

క్రికెట్ ఆడితే - సమస్య. (క్రికెట్ లో ఎక్కువమంది బ్రాహ్మలని ఒక ఏడుపు ఉంది)

మిలట్రీలో చేరితే - సమస్య. (ఐలయ్య)
మిలట్రీలో చేరకుంటే - సమస్య. (తిని కూర్చుంటున్నారని ఏడుపు)

Advertisement

విదేశీ సంస్థల్లో ఉన్నతాధికారిలైతే - సమస్య. ( సుందర్ పిచ్చయ్య వగైరాలను చూసి)

రాజులుగా ఉండి ఉంటే - సమస్య.
రాజులుగా ఉండకపోతేనూ - సమస్య.

కవిత్వం వ్రాస్తే - సమస్య.
వ్రాయకుంటే - సమస్య.

వేదం చదివితే - సమస్య. (ఎవరికీ నేర్పలేదని, జ్ఞానం అంతా దాచుకున్నారని ఏడుపు)
వేదం నేర్పుతే - సమస్య. (ఏదీ లేని పుక్కిటి పురాణ వేదాలను ప్రోస్తహిస్తూ, వలసార్య పెత్తనాన్ని పెంచి పోషిస్తున్నారనని ఏడుపు)

Advertisement

బాపడు వేదం చదవకపోతే - సమస్య.
మంత్రజపం చేస్తే - సమస్య. మాకు నేర్పలేదని.
చెయ్యకుంటే - సమస్య.
(ముక్కు మూసుకుని మంత్ర జపము వదిలేసి
మా పనుల్లో దూరుతున్నావని)

విద్య నేర్పితే - సమస్య. ఏకలవ్యుడికి నేర్పలేద్!
నేర్పితేనూ - సమస్య. (వాడికే నేర్పావు అని)

తోచిన మంచి చెబితే - సమస్య. (మనువాదం అని)
చెప్పకుంటే - సమస్య. (ఏమీ చెప్పలేనోడు బ్రాహ్మడెలా అయితివి)
చాణుక్యుడిలా రాజ్యం కాపాడితే - సమస్య.వాడిని ఎక్కిస్తివి అని.
కాపాడకుంటే - సమస్య. నువ్వే కదా మంత్రివి. నీ డ్యూటీ అది కాదా?

అర్చకత్వం చేస్తే - సమస్య (మాకా పోస్ట్ ఈలేదే)
చెయ్యకుంటే - సమస్య. నీకు బలిసింది. డబ్బులు రావని ఆ ప్రొఫెషన్ వదిలేస్తివి.

శాకాహారం తింటే - సమస్య.
తినకుంటే - సమస్య.

ఒక్కమాటలో చెప్పాలంటే - బాపడు
ఏం చేసినా సమస్య!
ఏమ్ చెయ్యకున్నా సమస్య. 🙂

లేటెస్ట్ మరో కొంపలు మునిగే సమస్య -
దురంధర్ తీసిన వాడు బ్రాహ్మడు. 😀

బ్రాహ్మడు సినిమా తీస్తే - సమస్య. (బత్తాయి ఒలిచి తినిపిస్తున్నావు అని. 😀)
తీకుంటే - సమస్య. నీకు రాదు అని.

తాము‌ బాపడికి ఇన్ని సమస్యలు సృహ్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే…
అనేది అసలు సమస్య
అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

బాకీసబ్_బక్వాస్