గ్రహాము మూర్తివంతము

శ్లోకం

జన్మ రక్ష రాజేశ్చ గ్రహ ప్రవేశకాలొడు రాశౌ
యది చార జంచ రుద్రేరసే జన్మని హేమమూర్తి
శ్శుభంక రాజేషు రాజితశ్చ సచాద్రి దిగ్విహ్నిషు
తామ్రమూర్తిః కష్టం గజార్కాబ్ధిషు కౌహితస్య

Advertisement


గ్రహ మూర్తి నిర్ణయం

రవి మొదలైన గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతున్నప్పుడు ఆ రాశిని ప్రవేశించే కాలంలో ఉన్న నక్షత్రం ఏది అవుతుందో పంచాంగాన్ని బట్టి తెలుసుకొని జన్మరాశి లగాయితు నిత్య నక్షత్ర రాశి వరకు లెక్కించగా

Advertisement

1,6,11 రాశుల్లో ఒకటైన సువర్ణమూర్తి అని
2,5,9 రాశుల్లో ఒకటైతే రజిత మూర్తి అని
3,7,10 రాశుల్లో ఒకటైతే తామ్రమూర్తి అని
4,8,12 రాశుల్లో ఒకటైతే లోహమూర్తి అని అంటారు.

గోచారరీత్యా గ్రహాలు దుష్టస్ధానాలలో ఉన్న సువర్ణమూర్తి, రజితమూర్తి అయిన శుభ ఫలితాలను ఇస్తారు.

తామ్రమూర్తి, లోహమూర్తి అయిన గ్రహాలు శుభస్ధానాలలో ఉన్న చెడు ఫలితాలనే ఇస్తారు.

Advertisement

[figure: చింతా గోపిశర్మ సిద్ధాంతి]


జాతక ఫలితాల పరిశీలన విధానం

ఏ జాతకుడికి అయిన జాతకఫలితాలు చెప్పేటప్పుడు రెండు విధాలుగా పరిశీలన చేయవలసిన అవసరం వస్తుంది.

1. గ్రహచారము
2. గోచారము

Advertisement

1. గ్రహచారము

గ్రహచారము అనగా మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా గ్రహములు పొందిన రాశి యొక్క స్వభావమును అనుసరించి గ్రహ దశలను తెలుసుకొని జన్మ లగ్నము లగాయితూ గ్రహములు పొందిన ఆధిపత్యము ననుసరించి ఆయా గ్రహముల బలాబలములను తెలుసుకొని ఫలిత నిర్ణయం చేయటం మొదటిది.


2. గోచారము

ఇక రెండవది గోచారము.

Advertisement

ఈ విధానములో వర్తమాన పరిస్థితులలో గ్రహముల గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణముగా మానవ జీవితముపై కలుగు శుభ, అశుభ ఫలితములను తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది.

గోచారము ప్రకారము గ్రహములకు ఫలితములను తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు జన్మ లగ్నమును ప్రామాణికముగా తీసుకోకూడదు.

ఇక్కడ జన్మ రాశి మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.

ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గోచారము ఫలితమును సులభంగా తెలుకోవడానికి మహర్షులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసినారు.

ఈ మూర్తులను లోహములతో పోల్చి చూపారు.


పంచలోహాలు

పంచ లోహాలలో

  • బంగారము
  • వెండి
  • రాగి
  • ఇత్తడి
  • ఇనుము

ఇవి ఒకదానికన్న ఒకటి తక్కువ విలువ కలవి.

ఉదా :

బంగారము చాలా విలువ కలిగినది
దానికన్నా వెండి తక్కువ విలువ
దానికన్నా రాగి
దానికన్నా ఇత్తడి
దానికన్నా ఇనుము

ఇలా విలువ తగ్గి పోతుంది.

ఈ లోహాలకున్న విలువలకు అనుగుణముగా సాధారణ మానవునకు కూడా సులభంగా అర్ధం అవుతుందనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసారు.


గ్రహ మూర్తులు

  1. సువర్ణమూర్తి (బంగారము)
  2. రజిత మూర్తి (వెండి)
  3. తామ్ర మూర్తి (రాగి)
  4. లోహ మూర్తి (ఇనుము)


ఫలితాలు

సువర్ణ మూర్తి → 100% శుభ ఫలితములను

రజిత మూర్తి → 75% శుభ ఫలితములను

తామ్ర మూర్తి → 50% శుభ ఫలితములను

లోహ మూర్తి → 25% శుభ ఫలితములను ఇచ్చును.


మరిన్ని విషయములు రేపటి పోస్టులో

మీ..
చింతా గోపిశర్మ సిద్ధాంతి

సంప్రదించండి :- 098661 93557

#ఆస్ట్రాలజీ #జ్యోతిషం #జాతకము #astrologer_chinta #astroguru_chinta #astrologerinandhara