పేదల చలివేంద్రం ఈ మట్టి కుండ"

ఇది మట్టికుండ కాదు
ఎండ తాపాన్ని తీర్చేది!!…
మనిషి మనసుకు ముడిపడి
బతుకంతా జతగూడి
మన గుండెను తడిగా చేసి
ప్రాచీన సంప్రదాయాల ఒరవడిగా
మన అరోగ్యాన్ని కాపాడే జీవనాడి…
ప్రేమను ఒలికించే సామాన్యుడి మట్టికుండ !!

Advertisement

మమతను మట్టిలో కలిపి…
ప్రేమ,ఆర్ద్రత అనే నీటిని మట్టిలోపోసి తడిపి…
ప్రకృతి ధర్మాలను మిళితం చేసి
కళాత్మక హృదయంతో తయారుచేసిన మట్టికుండ!!

మట్టిపొరలలోని ధాతువుల
సమ్మేళనమే మట్టికి పట్టు!!
మనుషులకు ఆరోగ్యాన్ని తెచ్చి పెట్టు!!
అందుకే తడారిన గొంతును తడుపు…

Advertisement

తనువంతా స్పర్శిస్తూ…
అంతరంగాన్ని తడుముతూ…
ఆత్మీయతను ప్రోగు చేసి… మానవత్వంతో పిసికి…
పంచభూతాల ధర్మాన్ని బాగా దట్టించి..
అన్ని కాలాల్లో పరిధి దాటని
కళల సృష్టిగా పవిత్రమైన మట్టికుండ!!
మన ముందుకు వడివడిగా వచ్చింది…

ఒకప్పుడు మనిషికి మట్టికీ ముడిపడి ఉండేది…
నేడు మట్టిపాత్రల పైన ప్రపంచీకరణ పోకడలు
పొడచూపటం వల్లనే మనిషికి దూరమవుతున్నాయి….

ఎందరికో ఓర్పునిచ్చి ఓదార్చి దప్పిక తీర్చినవి…
చల్లని నీటితో తాపం తీర్చుకున్నారు…
వ్యత్యాసము లేకుండా అందరికీ ఆసరమవుతుంది…

Advertisement

పరిపక్వతను పొందటం కోసం
ప్రకృతి ధర్మాన్ని నిలపటం కోసం
తనకు తాను శక్తిని పొందటం కోసం
అగ్నిలో కాలి పునీత మవుతుంది ఈ మట్టి కుండ!!

ధర్మాన్ని నిలుపుకొని
అధర్మాని తొలిగించుకుంటుంది..
ఇదే నిజమైన మట్టి ధర్మం నిండైన మానవత్వం…
నిజాయతీకి నిలువెత్తు అద్దం!!

ఖర్చు లేని కార్ఖానాలో తయారై
పేదల చలివేంద్రం(ఫ్రిడ్జి)గా
పేరు తెచ్చుకున్న మట్టి కుండ!!…

అంబటి నారాయణ
9849326801
నిర్మల్