మహా శివరాత్రి పర్వదిన సందర్భముగా..

దత్తభక్తులకు ఒక విజ్ఞప్తి..

Advertisement

తేదీ 15 - 02- 2026 ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వదినం..

మహా శివరాత్రి, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ఒక ప్రత్యేకత సంతరించుకున్న పండుగ.. సాధారణంగా.. మహా శివరాత్రి నాడు భక్తులు శైవ క్షేత్రాలను దర్శించటం అనేది ఒక అలవాటు..అక్కడ ఏర్పాట్లు ప్రభుత్వ సహకారం తో ఆ ఆలయ నిర్వాహకులు చేస్తుంటారు..

Advertisement

కానీ.. మహాశివరాత్రి నాడు, మొగలిచెర్ల గ్రామములో కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి బృందావన దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి రావటం.. వారి రాకపోకల సౌకర్యార్ధం RTC వారు 80, 90 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం.. ఏ అవాంఛనీయ సంఘటన జరుగకుండా పోలీస్ యంత్రాంగం పని చేయడం.. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండటానికి ఆ శాఖ సిబ్బంది పర్యవేక్షణ చేసుకోవడం..ఇవన్నీ కూడా ప్రత్యేకమే..

మా అంచనా ప్రకారం.. సుమారు 30, 40 వేల మంది శ్రీ స్వామివారి బృందావన దర్శనానికి వస్తారని అనుకుంటున్నాము..ఏ భక్తుడు ఇబ్బంది పడకుండా.. శ్రీ దత్తాత్రేయ స్వామివారి బృందావన దర్శనం చేసుకొని.. తృప్తిగా తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాము.. మహా శివరాత్రి నాడు.. మధ్యాహ్నం మరియు రాత్రికి 15 వేల మందికి అన్నప్రసాదం అందించడానికి సమాయాత్తం అవుతున్నాము..

రెండు మూడేళ్ల క్రితం వరకు.. శ్రీ స్వామివారి మందిరానికి.. మహాశివరాత్రి నాడు వచ్చే భక్తులకు సేద దీరే వసతి తక్కువ గా ఉండేది.. ప్రస్తుతం షెడ్ల నిర్మాణం జరిగింది.. ఏ కొరతా లేకుండా త్రాగునీరు సరఫరా చేయగలుగుతున్నాము.. అన్నప్రసాద వితరణ కూడా భక్తుల సహకారం తో చేయగలుగుతున్నాము.. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ఆ అవధూత శ్రీ దత్తాత్రేయుడి ఆశీస్సులే కారణం..

Advertisement

దిగంబర అవధూతగా సంచరించిన ఒక యువ సాధకుడు కఠోర తపస్సు చేసి..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన తపోభూమిని మీరు కూడా దర్శించండి..అనుభూతి చెందండి.. ఎందరో సాధకులు.. దత్త భక్తులు..ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించి.. తాము పొందిన అనుభూతి మాటల్లో వర్ణించలేమని మాతో చేప్పేవారు..

అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర అభివృద్ధికి సహృదయులైన ఎందరో దాతలు సహకరిస్తున్నారు.. మీరు కూడా ఈ ప్రయత్నం లో మీ వంతు సహకారన్ని అందిస్తారని..

ముఖ్యంగా.. మహా శివరాత్రి నాడు జరిగే అన్నప్రసాద వితరణ కొఱకు మీరు సహాయ సహకారాలను మనఃస్ఫూర్తిగా అందివ్వమని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము..

ఈనెల 15 వతేదీ..ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వదినం..

ఆరోజు మీరు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి బృందావనం దర్శించి.. శ్రీ స్వామివారి కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తూ..

సర్వం..
శ్రీ దత్తకృప!!

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 94402 66380).