🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

ప్రార్థన - ఫలితం

Advertisement

నేటి మన భక్తి ఎలా వుంది అంటే!!…

ఒక వ్రతం చేసినా, ఉపాసం చేసినా … వెంటనే ఫలితం కనబడాలి, అలా కాక పోతే… అప్పుడే దేవున్ని అయినా మారుస్తాం, లేకపోతే కోపం తో తిడతాం …

Advertisement

ఎవరైనా ఈ దేవుణ్ణి నమ్ముకొ, ఇట్టే పనులు అయిపోతాయి అంటే , చాలు అప్పుడే వెళ్తాం …

అమాంతం బిందెల కొలదీ నీరు పోసినంత మాత్రమున - మొక్క చెట్టుగా మారి ఫలాలను ఇచ్చేయదుగా! దానికి కొంత సమయం అవసరం.

అలానే ప్రార్థన కూడా ఫలించడానికి కొంత సమయం తీసుకుంటుంది.

Advertisement

మరి ఏమి చేయాలి???

సహనం వహించాలి,
మనం అనుకోగానే పనులు జరిగిపోవాలంటే కుదరదు,
దేవుణ్ణి ప్రార్థించి ఆయనపై విశ్వాసము పెట్టుకోవాలి,
ఆలస్యం అయినా తప్పకుండా ఆదుకుంటాడనే నమ్మకం వుండాలి…

ఉదా!!…
ఒక కటింగ్ షాప్ కి వెళ్లి, కటింగ్ చేయు అని కూర్చుంటాము…
అయ్యో ఏమి చేస్తాడో, నా తలపై ఎన్నింగాయాలు చెస్తాడో అని ఆలోచించం కదా!!…

చేసినంత సేపు ఆనందంగా కూర్చుని మై మరిచి పోతాము …
మరి ఆ విశ్వాసం భగవంతుని పై లేకపోతే ఆయన ఎలా ఫలితాన్ని అందిస్తాడు??…

         శుభమస్తు

🙏 శ్రీ సద్గురు పీఠం నుండి…✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏