ఋణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాలయ

ఋణము ఉంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న ఋణం బట్టి భార్య కాని, భర్త కాని వివాహబంధంతో ఏకమవుతారు.

Advertisement

అలాగే పిల్లలు పుట్టాలన్నా వారి ఋణము మనకు ఉండాలి. ఇక ఇంట తిరిగే పశువులు. ఏ ఇతరమైనా కూడా ఋణము ఉంటేనే తప్ప మనకు దక్కవు. అంతెందుకు ఋణము ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు. బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా. లేక మాట కలిపినా కూడా అది కూడా ఋణానుబంధమే….

ఋణమనేది లేకుంటే ఎవరిని కలలో కూడా మనం చూడలేము.

ఇక ఋణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు. ఈ ఋణానుబంధం విలువ తెలుసుకుని మసలుకోవాలి….

Advertisement

ఋణం కేవలం ధనం మాత్రమే కాదు, బాంధవ్యం కూడా. అందుకే ధన బంధం కంటే ఈ బంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి.

"మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో ఋణానుబంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి"

భగవద్ బంధువులారా, ఋణం లేనిదే తృణం కూడా ముట్టదు అని మన పెద్దలు చెప్పారు. ఇది నిజం. మనం ఎంత యత్నించినా కూడా ఋణం లేకపోతే ఏది జరగదు. ఏ బంధం నిలువదు.

Advertisement

ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి, నిందించకండి.

ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి. దూరంగా ఉన్నా మన వాళ్లేగా. ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా. వాళ్ల సంతోషం కోరుకోండి.

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸