ఓ శ్రీ కాళహస్తీశ్వరా!

నీవే నాకు ఈ జన్మను ఇచ్చావు.

Advertisement

నేను నీ సేవకుడను.

సర్వకాల సర్వావస్థల యందును నీ నామము తప్ప ఇంకొకటి తలపను.

Advertisement

పండితులు ఎవరైనా తమ పాండిత్యముతో నీగురించి ఒక కావ్యము రచించవచ్చును.

నీ గురించి ఏమైనా పద్యములో, దండకములో వ్రాసిఇచ్చినచో నిత్యమూ పఠింతునని ఒక పామరుడు పండితుని అడుగవచ్చును.

చదువుట, వ్రాయుట వచ్చినవారు తాము కవిత్వము చెప్పలేకపోయినప్పటికీ, నిను గురించి వివరముగా తెలియజేయు పురాణాది ప్రబంధములను నియమ నిష్ఠలతో చదువవచ్చును.

Advertisement

వీరందరూ నీ భక్తులు.

ఈ భక్తులు అందరూ నాకు బంధువులు.

నీ పాదసేవ అను బంధమే మమ్ములను కట్టివేసినది.

జన్మ సంబంధము కానీ, రక్తసంబంధము కానీ ఈ లోకపు బంధములే కానీ మోక్షమును ఈయజాలవు.

Advertisement

ఇవి తిరస్కరించవలసిన బంధములే,
నేను నీభక్తులతోడి స్నేహబాంధవ్యములను మాత్రమే కోరుకుంటున్నాను.

నన్ను దయ చూడవలసినది.

శ్రీ కాళహస్తీశ్వరా !శరణు!! శరణు !!!

"శ్రీ ధూర్జటి మహాకవికి ప్రణామములు" 🙏

🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀