వాల్మీకి రామాయణం ప్రారంభంలో, నారద మహర్షి శ్రీరాముని కల్యాణ గుణాలను ఇలా వివరిస్తారు.

వాల్మీకి ప్రశ్న ?

Advertisement

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్|
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||

ఈ లోకంలో ప్రస్తుతం అన్ని సుగుణాలు కలవాడు (గుణవాన్), పరాక్రమవంతుడు (వీర్యవాన్), ధర్మాన్ని తెలిసినవాడు, చేసిన మేలును మరిచిపోనివాడు, సత్యమే మాట్లాడేవాడు మరియు పట్టుదల గలవాడు ఎవరు ?

Advertisement

నారదుని సమాధానం. !

ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ||

ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, 'రాముడు' అని అందరిచేత పిలవబడేవాడు ఆ గుణాలన్నీ కలవాడు. ఆయన మనస్సును జయించినవాడు, గొప్ప పరాక్రమవంతుడు (మహావీర్యో), కాంతివంతుడు, ధైర్యవంతుడు మరియు జితేంద్రియుడు.

Advertisement

గుణవాన్ - అనంతమైన కల్యాణ గుణాలు కలవాడు.

వీర్యవాన్ - ఎదురులేని శక్తి సామర్థ్యాలు, పరాక్రమం కలవాడు.

ధర్మజ్ఞః - ధర్మము యొక్క సూక్ష్మాలను తెలిసినవాడు.

సత్యవాక్యః - ఆడిన మాట తప్పనివాడు.

Advertisement

శ్రీరాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు,

ఒక మనిషిగా ఎలా జీవించాలో చూపిన "మర్యాద పురుషోత్తముడు".

అందుకే వాల్మీకి ఆయనను ఈ గుణాలతో వర్ణించారు.

జై శ్రీరామ్ !