కుటుంబ యజమాని చేసిన పుణ్యం ఎంత మందికి అందుతుంది?

సకల ధర్మకార్యాలు, దానాలు, పూజలు, యజ్ఞయాగాలు చేసిన యజమాని పుణ్యం ఒక దశలో మహోన్నతమైన పుణ్యంగా మారి ఆయనకే కాకుండా, ఆయన కుటుంబానికీ, సన్నిహితులకీ కూడా అందుతుంది. ఇంకా ఎన్నో ధర్మకార్యాలను చేసి మహాపుణ్యాన్ని పొందితే ఆ ఫలము సమస్త ప్రజలకూ విస్తరిస్తుంది.

Advertisement

అందుకే అంటారు – ఇన్ని పాపాలు జరుగుతున్నా ప్రళయం సంభవించడం లేదు అంటే ఎక్కడో ఎవరో మహాపుణ్యాత్ముడు చేసిన పుణ్యం సమస్తాన్ని కాపాడుతుందని.

Advertisement

ఆడి మాట తప్పని సత్యహరిశ్చంద్రుడి పుణ్యరాశి వల్ల అయోధ్యా పురవాసులందరికీ స్వర్గలోక ప్రవేశం లభించింది. కోట్లకొలది విమానాలు స్వర్గలోకంనుండి అయోధ్యవాసుల కోసం వచ్చాయి.

అపూర్వమైన ఆ హరిశ్చంద్ర ఘట్టాన్ని చదివినవారికి, విన్నవారికి పుష్కర, ప్రయాగ, సింధు తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలము లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని సత్యహరిశ్చంద్ర గాథ తెలియజేస్తోంది.