తితిదే ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు (76) కన్నుమూశారు. కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ రాజమండ్రిలో జన్మించారు.
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు (76) కన్నుమూశారు. కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ రాజమండ్రిలో జన్మించారు. కానీ తిరుపతి ఆయన స్వస్థలంగా మారిపోయింది. గాయని ఎస్ జానకి మేనల్లుడు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు గరిమెళ్ల వారు స్వరకల్పన చేశారు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలను సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ గరిమెళ్ల ప్రపంచ ప్రఖ్యాతి సాధించారు.
కర్ణాటక సంగీతంలో గరిమెళ్ల డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో పట్టు సాధించారు. కేవలం సంగీతం నేర్చుకోవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ గరిమెళ్ల విశేష కృషి చేశారు. 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరి ఆస్థాన విద్వాంసుడి స్థానం సాధించే వరకూ ఆయన ప్రయాణం సాగింది. 2006లో పదవీ విరమణ పొందారు. 6000లకు పైగా కచేరీలు చేశాడు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేశారు. టీటీడీ కోసం వేలాది ఆడియో క్యాసెట్ లు చేశారు.
శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి కన్నుమూత మనకు తీరని లోటు!
తరచుగా అడిగే ప్రశ్నలు
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎక్కడ జన్మించారు?
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు రాజమండ్రిలో జన్మించారు. తర్వాత తిరుపతి ఆయన స్వస్థలంగా మారింది. ఆయన గాయని ఎస్ జానకి మేనల్లుడు.
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన గాయకుడిగా ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నారు?
ఆయన 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్‌లో గాయకుడిగా చేరి, 1978 నుండి 2006 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. 2006లో పదవీ విరమణ పొందారు.
గరిమెళ్ల ఎన్ని అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు?
గరిమెళ్ల 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. "వినరో భాగ్యము విష్ణుకథ", "జగడపు చనువుల జాజర", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు" వంటి ప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు.
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎవరి వద్ద సంగీతంలో పట్టు సాధించారు?
కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసిన ఆయన, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో పట్టు సాధించారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు.
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎన్ని కచేరీలు చేశారు?
గరిమెళ్ల 6000లకు పైగా కచేరీలు చేశారు. టీటీడీ కోసం వేలాది ఆడియో క్యాసెట్‌లు చేశారు; స్వరాలతో కూడిన పుస్తకాల ప్రచురణ, సిడి రికార్డింగ్‌లలోనూ విశేష కృషి చేశారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
వార్తలు నుంచి మరిన్ని
- అరోరా హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర భగ్నం: రైఫిల్ జామ్ కావడంతో ఇల్లినాయిస్ యువకుడిపై అభియోగాలు, పోలీసుల వెల్లడి
- హిందూ పండుగల వార్తలు, అక్టోబర్ 2026: కుల్లు దసరా, బస్తర్, ఢిల్లీ రామలీల, గుజరాత్ గర్బా, బతుకమ్మ, ఛఠ్ మరియు అయోధ్య దీపోత్సవం
- పండుగ ప్రత్యేక రైళ్లు 2026: ఇప్పటివరకు ప్రకటించిన దసరా, దీపావళి, ఛఠ్ స్పెషల్స్, మార్గాల వారీగా
- విదేశాల్లోని హిందూ ఆలయాల వార్తలు, అక్టోబర్ 2026: నీస్డెన్లో 42 అడుగుల తపోమూర్తి, మహా అన్నకూట్, యునెస్కో దౌత్యవేత్తలకు పారిస్ మందిరం ఆతిథ్యం, అబుదాబిలో ప్రార్థనలు
- హిందూ ఆలయ వార్తలు, అక్టోబర్ 2026: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు, శబరిమల భద్రత, కాశీకి కొత్త CEO, పూరీ అప్డేట్స్

